Monday, 14 Jun, 5.00 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
'సమంతకు' నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్.. సినిమాకి మించిన రెమ్యూనరేషన్..?

పెళ్లి తర్వాత అక్కినేని కోడలు సమంత క్రేజ్ మరింత పెరిగింది.ఏ పాత్రలో నైనా ఒదిగిపోయి నటించే ఈ అమ్మడు పెళ్లికి ముందు అగ్ర హీరోయిన్ గా వెలుగొందింది. ఆ తర్వాత అక్కినేని హీరో నాగ చైతన్య ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్ళి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ అదే క్రేజ్ ని రెట్టింపు చేసుకుంటూ.. ప్రస్తుతం వరుస అవకాశాలతో టాలీవుడ్ హీరోయిన్స్ కన్నా అత్యధిక రెమ్యూనరేషన్ ను అందుకుంటోంది.ఒక విధంగా చెప్పాలంటే పెళ్లికి ముందు కన్నా.. పెళ్లి తర్వాతే ఈ భామకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.

ఇందులో భాగంగానే అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై ఫుల్ బిజీగా మారింది సమంత.కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.ఇక ఇటీవలే డిజిటల్ రంగంలో కూడా అడుగుపెట్టి తన సత్తా చాటింది ఈ హీరోయిన్.తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్2' అనే వెబ్ సీరీస్ విడుదలైన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ వెబ్ సీరీస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.సమంత డిజిటల్ ప్లాట్ ఫాం లో నటించిన మొదటి వెబ్ సీరీస్ ఇది.ఇలా మొదటి వెబ్ సీరీస్ తోనే భారీ విజయాన్ని అందుకుంది సమంత.ఇదిలా ఉంటె తాజాగా ఓ అగ్ర ఓటీటీ సంస్థ ఈ హీరోయిన్ కి ఒక భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సౌత్ లో సమంతకు మంచి పాపులారిటీ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ నిర్వహకులు ఆమెతో ఓ వెబ్ సీరీస్ తీయడానికి ప్లాన్ చేస్తోంది.ఈ వెబ్ సీరీస్ కి గాను రెమ్యూనరేషన్ గా సమంత కుబ్ ఎనిమిది కోట్లు ఇవ్వడానికి సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులోనిజం ఎంతున్నది తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.ఇక ఈ అమ్మడు సినిమా విషయానికొస్తే..గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పిరియాడికల్ మూవీ చేస్తోంది..ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది..!!

టాప్ హీరోలకు దిశానిర్దేశ్యం చేస్తున్న నితిన్ !

మెగాస్టారా .. మజాకా.. ఈసారి కూడా..

విజయ్ దేవరకొండకి మరో అరుదైన రికార్డు..!

దళపతి విజయ్ పారితోషికం ఎంతో తెలుసా..?

నాగశౌర్య రచ్చ.. సిక్స్ ప్యాక్ కాదు, అంతకు మించి!

స్మరణ : సంగీతంలో చక్రం తిప్పిన చక్రి విశేషాలు..

టీవీ: బుల్లితెర నటీమణులు ఎవర్ని పెళ్లి చేసుకున్నారో తెలుసా..?

కొడుకుని యాక్టింగ్ స్కూల్ కి పంపుతున్న పవన్...?

హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ న్యూ మాస్టర్ ప్లాన్ !

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top