Sunday, 20 Sep, 6.00 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. సంజనా పేరు వేరట..!!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతుంది. ఇండస్ట్రీ తో పనిలేకుండా చాలా మంది డ్రగ్స్ వినియోగం, అమ్మకాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా శాండిల్ వుడ్ ఇండస్ట్రీ లో ఈ మాట ఎక్కువగా వినపడుతుంది. ఇండస్ట్రీలో ప్రముఖుల తో పాటుగా, హీరోయిన్లు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే శాండిల్ వుడ్ నుంచి కొందరు డ్రగ్స్ కేసు లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.. హీరోయిన్ సంజన, రాగిణి ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఆ ఇద్దరు పోలీసుల కస్టడీలో ఉన్నారు. సంజన గల్రాని పేరు చర్చనీయాంశంగా మారింది.. ఆమె మతం మారిందని వినిపిస్తుంది. లవ్ జీహాద్‌లో ఇరుక్కున్న ఆమె తన పేరును మహిరాగా మార్చుకున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబర్గి సంచలన ఆరోపణలు చేశారు.. డాక్టర్ అజీజ్ తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించిందట.. దాంతో ఆమె పేరు మహిరాగా మార్చుకుందని ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. ఆమె మతం మార్చుకుని అతని తో నిశ్చితార్థం చేసుకుందని వార్తలు వినపడుతున్నాయి.

ఈ విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.మహిరాగానే ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనాలని ప్రశాంత్‌ డిమాండ్ చేశారు. దీంతో పాటు కర్ణాటక మాజీ మంత్రి , ప్రస్తుతం బెంగళూరు లోని చామరాజపేట నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ తో కలిసి నటి సంజనా శ్రీలంక టూర్‌కు వెళ్లిన విషయం కూడా ముమ్మాటికీ నిజమేనని ఆయన అన్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమెకు ఇప్పుడు మతం మార్పిడి విషయం బయట పడటంతో కొంత గందరగోళం నెలకొంది. ఈమె చేసే ప్రతి పనికి నా దగ్గర ప్రూఫ్ లు ఉన్నాయని ప్రశాంత్ అన్నారు. మరి ఈ విషయం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి..అమరావతి రైతులకు జగన్ గుడ్ న్యూస్...!

గత వారం ఎక్కువ టీ.ఆర్.పి రేటింగ్ సొంతం చేసుకున్న సినిమాలు ఇవే!

అఖిల్ కు పెళ్లి చేయబోతున్న సమంతా.. మరి పెళ్లి కూతురు ఎవరు?

ధోని అభిమానుల్లో ఉత్కంఠ

మహిళ తల వెంట్రుకల్లోకి పాము.. హైర్ క్లిప్ అనుకున్న మహిళ.. చివరికి..?

బాలీవుడ్ కాదు టాలీవుడ్ దే అగ్రస్థానం.. కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు..?

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 9 మందిని అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ..!

భయ పడకండి మీకు మేమున్నాం:

అవినీతి అధికారులు మిమ్మల్ని జలగల్లాగ పీడిస్తున్నారా? మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరితో మొరపెట్టుకోవాలో మీకు తెలియడంలేదా? ఇండియా హెరాల్డ్ నిర్భయంగా మీ ఘోషను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళుతుంది. మీ బాధను పూర్తి వివరాలు, ఆధారాలతో సహా nofear@indiaherald.com కు నేడే పంపించండి.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top