Saturday, 25 Sep, 5.15 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

గాస్సిప్స్
శేఖర్ కమ్ములతో రౌడీ హీరో... మరో "లవ్ స్టోరీ" ?

"అర్జున్ రెడ్డి" చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇటు హీరోగా..అటు వ్యాపారవేత్తగా ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఎ వి డి పేరిట తన సొంతూరు అయిన మహబూబ్ నగర్ లో మల్టీ ఫ్లెక్స్ ను ఓపెన్ చేశారు. ఇందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా చేసిన "లవ్ స్టోరీ" చిత్రం తొలుత స్క్రీన్ పై మెరవడం విశేషం. ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ "లైగర్" చిత్రంతో బిజీగా ఉన్నారు. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేకులు పడ్డ ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమయ్యి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని పట్టుదలతో ఉన్నారు.

"వరల్డ్ ఫేమస్ లవర్" సినిమా తర్వాత కాస్త విరామం తీసుకుని "లైగర్" మూవీకి ఒకే చెప్పిన విజయ్ దేవరకొండ...ఇకపై గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతే కాదు తాజాగా లవ్ స్టొరీ సినిమా సక్సెస్ తో జెట్ స్పీడ్ లో ఉన్న శేఖర్ కమ్ములతో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు శేఖర్ కమ్ముల ఇటు విజయ్ దేవరకొండ హిట్ లవ్ స్టొరీ లకు కేరాఫ్ అడ్రస్. అయితే వీరిద్దరూ కాంబో తెరపై మరో రేంజ్ లో ఉండబోతుందని టాక్. విజయ దేవరకొండ సినిమా కెరీర్ స్టార్ట్ అయింది శేఖర్ కమ్ముల తోనే కావడం విశేషం. హ్యాపీడేస్ చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు అదే డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడు అంటే ఎంతో ఆసక్తికరంగా ఉంది కదా.

హ్యాపీ డేస్ సినిమాకి ఇప్పటికీ ఎంత మారిందో అనుకుంటేనే చాలా ఆశ్చర్యమేస్తుంది. అప్పట్లో ఒక చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ నేడు ఒక స్టార్ హీరో. అందులోనూ యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న కధానాయకుడు. మరి వీరిద్దరి కాంబినేషన్ పై అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఇంతకీ లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ..శేఖర్ కమ్ముల సినిమాలో నిజంగా కనిపించనున్నారా అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగాల్సిందే.

మచిలీపట్నం ఆస్పత్రిలో ఆడశిశువు మాయం..చుట్టమని వచ్చి!

బిగ్ బాస్ - 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

'లవ్ స్టోరీ' తో కెరీర్లో ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టిన చైతూ..!!

హుజురాబాద్ ప్రజలకు తెలంగాణ సర్కార్ మరో కానుక !

బిగ్ బాస్ 5: "మానస్ - ప్రియాంక" మధ్యలో హమీదా ?

వెబ్ సీరీస్ భవిష్యత్తులో ఉండొచ్చు : మహేష్ బాబు

ఆయనకు గుడ్ బై చెప్పేసిన బాబు... టీడీపీలో హాట్ టాపిక్ ?

చంద్రబాబు వీళ్లను నమ్ముకుంటే 2024లోనూ నిండా మునగాల్సిందే..!

వైసీపీలో పెద్ద బాంబు పేలుతోందా...!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top