Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీలీల ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సినిమాలకు బ్రేక్..?

శ్రీలీల ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సినిమాలకు బ్రేక్..?

టాలీవుడ్, కోలీవుడ్లో మోస్ట్ హ్యాండ్సమ్ బ్యూటీగా పేరు సంపాదించింది హీరోయిన్శ్రీ లీల. మరొకవైపు బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం శ్రీలీల చేతిలో సినిమాలేవీ లేవని, సినిమాలకు బ్రేక్ ఇచ్చిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
శ్రీలీల రోజుకి రెండు కాల్షిట్లు ఇస్తూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వెండితెరకు కాస్త దూరంగా ఉండడంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. శ్రీ లీల కావాలనే సినిమాలకు విరామం ప్రకటించినట్లు వినిపిస్తున్నాయి.

శ్రీ లీల టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో కాస్త గ్యాప్ తీసుకోవడం వెనక ఒక బలమైన కారణం ఉన్నట్లు వినిపిస్తోంది.
శ్రీ లీల డాక్టర్ కోర్స్ చదువుతున్న నేపథ్యంలో గుంటూరు కారం సినిమా కోసం ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంది. అయితే ఇప్పుడు ప్రొఫెషనల్ యాక్టర్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన చదువును పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆమె సినిమాలను కాస్త పక్కన పెట్టినట్లు టాలీవుడ్లో వినిపిస్తోంది.

చదువు పూర్తి అయిన తర్వాత మళ్లీ సరికొత్త ప్రాజెక్టులతో తిరిగి వెండితెర పైన రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు వినిపిస్తోంది. 2021లో
పెళ్లి సందడి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగు కన్నడ వంటి భాషలలో పలు సినిమాలలో నటించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక పుష్ప 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ పెంచుకుంది. ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం ధనుష్ 55వ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది అలాగే బాలీవుడ్ లో కూడా మరో సినిమాలో నటిస్తోంది.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald