కరోనా వల్ల ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. దాంతో రోజు వారి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అందులో సినీ కార్మికులు కూడా వున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ను నమ్ముకుని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి అయితే షూటింగ్ లు రద్దు కావడం తో సినిమానే నమ్ముకున్న దినసరి కూలీలు ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు. దాంతో సినీ కార్మికులకు అండగా నిలబడానికి టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు ,రాజశేఖర్, అల్లరి నరేశ్, శివాజీ రాజా ఇప్పటికే తమకు తోచిన విధంగా విరాళాలను ఇవ్వగా ఈ జాబితాలోకి తాజాగా కింగ్ నాగార్జున కూడా చేరాడు.
సినీ కార్మికుల కోసం తన వంతు సాయంగా కోటి రూపాయలను నాగ్ విరాళంగా ప్రకటించాడు.
షాకింగ్ న్యూస్ : సిగిరెట్ లు తాగే వారికి కరోనా ప్రభావం ఎక్కువ ?
ఈ టైమ్ లో నువ్వు చెయ్యాల్సింది అది కాదు పవన్ కల్యాణ్ .. టైమ్ అంతా వేస్ట్ .. !
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Kancherla Mahender Reddy

