Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోషల్ మీడియా స్టార్.. కుర్చీతాత హఠాస్మరణం..!

సోషల్ మీడియా స్టార్.. కుర్చీతాత హఠాస్మరణం..!

సోషల్ మీడియాలో కేవలం ఒక్క డైలాగు ద్వారా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారారు కుర్చీ తాత. ఈయన అసలు పేరు అలియాస్ మహమ్మద్ షాషా. కుర్చీ మడతపెట్టి అనే డైలాగుతో సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు.
ముఖ్యంగా రికార్డు స్థాయిలో మిమ్స్ , రీల్స్ కూడా వైరల్ గా మారాయి. దీంతో ఆయన క్రేజ్ కూడా పెరగడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కూడా ఈ డైలాగును ఒక పాట రూపంలో మార్చడంతో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ పాటలో మహేష్ బాబు, శ్రీలీల కలిసి డాన్స్ వేసిన తీరు అందరిని ఆకట్టుకుంది.

తాజాగా కుర్చీ తాత తాజాగా హఠాస్మరణం చెందారు. హైదరాబాదులోని కృష్ణకాంత్ పార్క్ లో బుధవారం ఉదయం వాకింగ్ చేస్తూ ఉండగా ఒక్క సారిగా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రతకు వడదెబ్బ కారణంగానే కుర్చీ దాత మృతి చెందినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. మరొకవైపు కుర్చీ తాత మరణ వార్త విన్న అభిమానులు ,
నెటిజన్స్ సైతం తాత మృతికి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

కుర్చీ తాత హైదరాబాద్ ప్రాంతాలలో బిక్షం ఎత్తుకుంటూ తన జీవనాన్ని సాగించేవారు. అలాంటి సమయంలో కూర్చి మడత పెట్టే అనే డైలాగ్ వైరల్ గా మారడంతో ఈయనకు కూడా క్రేజ్ పెరిగింది. అంతేకాకుండా పని రకాల వివాదాలలో వార్తలలో నిలుస్తూ ఉండే ఈ కుర్చీ తాత కొన్ని సందర్భాలలో జైలుకు కూడా వెళ్ళివచ్చారు. గతంలో కూడా కుర్చీ దాత ఎన్నోసార్లు చనిపోయారంటూ పలు రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటన్నిటిని కుటుంబ సభ్యులు ఖండించారు. కానీ ఇప్పుడు నిజంగానే కుర్చీ తాత వడదెబ్బ కారణంగా హఠాస్మరణం చెందారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

" style="height: 884px;">

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald