Wednesday, 08 Jul, 5.00 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
సూపర్ స్టార్ తో జేమ్స్ బాండ్ మూవీనే ఫిక్స్ ....కథ ఇలా సాగనుందట.....??

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ల క్రేజీ కాంబో సినిమా కోసం కేవలం మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఎప్పుడో ఫిక్స్ అయి పట్టాలెక్కవలసిన ఈ సినిమాని ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ అనంతరం మొదలెట్టనునట్లు తెలుస్తోంది. మరోవైపు తన నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట కోసం సిద్ధం అవుతున్న సూపర్ స్టార్, దాని అనంతరం వంశీ పైడిపల్లి కూడా ఒక సినిమా చేయనున్నారని, వీటి రెండిటి తరువాతనే రాజమౌళి సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాల టాక్.

rrr ..." height="237" src="https://akm-img-a-in.tosshub.com/indiatoday/images/story/202004/Rajamouli-collage.jpeg?LRWuRgqyqtE0WqJa4Zs8HqRjCVnmb.2t" width="420"/>

దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మాతగా ఎంతో భారీ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఎలా ఉండనుంది అనే దానిపై ఎప్పటినుండో పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా చర్చలు మొదలయ్యాయి. కొన్నేళ్ల క్రితం మహేష్, పూరి జగన్నాథ్ ల కాంబోలో వచ్చిన బిజినెస్ మ్యాన్ సినిమా ఆడియో ఫంక్షన్ లో, నేను మహేష్ గారితో చేసే సినిమా ఏ జానర్ లో ఉంటె బాగుంటుంది అంటూ రాజమౌళి, మహేష్ ఫ్యాన్స్ ని అడిగిన ప్రశ్నకు గాను జేమ్స్ బాండ్ తరహా సినిమా చేయాలి అన్న మాటకు అక్కడ అభిమానుల నుండి విపరీతంగా రెస్పాన్స్ రావడం జరిగింది. దానిని బట్టి ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మాదిరిగా మహేష్ ని కూడా అభిమానులు అదేవిధమైన రోల్ లో చూడాలనుకుంటున్నట్లు స్పష్టం అయింది.

ఇక తాజాగా ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి కొన్ని నెలలుగా లాక్ డౌన్ కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా నిలుపుదల చేయడంతో, తదుపరి మహేష్ తో రాజమౌళి చేయబోయే సినిమా విషయమై ఇటీవల ఒక మంచి పాయింట్ ఆలోచించిన కథకుడు వి. విజయేంద్ర ప్రసాద్, దానిని కొడుకు రాజమౌళికి వినిపించడం జరిగిందట. దేశ భద్రతను కాపాడుతూ సాగె రా ఏజెంట్ మాదిరిగా సాగె హీరో, మధ్యలో పలువురు దుండగుల బారి నుండి మన దేశాన్ని చాకచక్యంగా ఎలా కాపాడాడు అనే పాయింట్ పై పలు కమర్షియల్ హంగుల మేళవింపుగా ఈ సినిమా సాగనునట్లు టాక్. ముఖ్యంగా మహేష్ బాబు హీరోయిజానికి ఏ మాత్రం ఢోకా లేకుండా, అలానే రాజమౌళి మార్క్ ఎమోషన్, భారీ యాక్షన్ వంటివి కలగలిపి ఈ సినిమా ఎంతో భారీ లెవెల్లో తెరకెక్కనుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు రాజమౌళి సినిమా రూపంలో పెద్ద పండుగ వచ్చినట్లే....!!ఉండవల్లి గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన వైఎస్‌.. ఏం జరిగిందంటే!

తెలంగాణ ఉద్యమ గాయకుడు నిస్సార్ కరోనాతో కన్నుమూత!

హెరాల్డ్ సెటైర్ : జగన్ కు మంచిపేరు వస్తోందని ఎల్లోమీడియా ఎంత బాధపడిపోతోందో ?

"మహా"నేత విజయ ప్రస్థానం..!

డబ్బే డబ్బు : విదేశీ ఈ కామర్స్ కంపెనీలకు చెక్ - స్థానిక స్టార్టప్ లకు డబ్బే డబ్బు !

ఆ ప్రచారమే వైఎస్‌ విజయానికి బాటలు వేసింది..!!

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ మాస్టర్ స్ట్రోక్ ..చంద్రబాబు, ఎల్లోమీడియాకు షాక్

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top