Wednesday, 27 Jan, 6.00 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
స్వామీజీ హత్య... జగన్ ని టార్గెట్ చేసిన స్వామీజీలు

చిత్తూరు జిల్లా ఐరాల మండలం చుక్క వారి పల్లి సమీపంలోని శ్రీ సిద్ధగిరి క్షేత్రం శ్రీ భగవాన్ రామతీర్థ సేవాశ్రమం లో అచ్యుతానంద స్వామీజీ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. గుర్తు తెలియని దుండగుల్లో ఒకరు సామిజీని హత మార్చినట్లు అదే ఆశ్రమంలోని మహిళా వృద్ధురాలు చెప్పారు. ఆ దుండగుడు తనపై కూడా అత్యాచారయత్నానికి ప్రయత్నించినట్లు ఆమె చెప్పడం గమనార్హం. తప్పించుకుని ముళ్లపొదల్లో దాక్కున్నా అని ఆమె అన్నారు. స్వామీజీ అనుమానాస్పద మృతిలో మరో కోణం కనపడుతుంది.

శ్రీవారి భక్తులకు అన్నదానం చేసేందుకు అచ్యుతానంద స్వామి కొనుగోలు చేసిన భవన వివాదమే ఆయన ప్రాణం తీసిందని సోదరుడు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీవారి భక్తులకు అన్నదానం కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పూతలపట్టు మండలం లోని మిట్టూరు వద్ద ఒక భవనాన్ని స్వామీజీ కొనుగోలు చేసారు. సంవత్సరాలు గడిచినా వ్యక్తి ఇంటిని ఖాళీ చేయకపోవడంతో హత్యకు దారితీసింది అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే స్వామి శ్రీనివానంద సరస్వతి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. చిత్తూరులో అచ్యుతానంద స్వామీజీని చంపడం దారుణం.. తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు.

రాష్ట్రంలో రావణ రాజ్యం ఉంది అని మండిపడ్డారు. స్వామీజీ లపై దాడులు చేయడం అత్యంత హేయం అని ఆయన ఆరోపించారు. స్వామీలకు రక్షణ లేదు..చివరకు ఒక స్వామిజీని హత్య చేశారు అని అన్నారు. దేవాలయాలఆస్తులను, ఆశ్రమాల ఆస్తులు కబ్జా చేస్తున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని జగన్ ఎటు తీసుకుపోతున్నారు? అని నిలదీశారు. ధర్మానికి, న్యాయానికి ప్రతీకలు న్యాయస్థానాలు అని అన్నారు. ధర్మదేవత సుప్రీం కోర్టు ద్వారా బుద్ధి చెప్పింది అని అన్నారు. రాష్ట్రంలో అకృత్యాల పై తక్షణమే కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి..రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. నెలరోజుల అవుతున్నా..రామతీర్థం ఘటనకు కారకులైన వారిని ఎందుకు పోలీసులు పట్టుకోలేదు అని నిలదీశారు.

కూతురుతో కలిసి రహనే స్టెప్పులు..వైరల్ !!

జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?

జగడ్డ: సాయిరెడ్డి పప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడకడం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జగడ్డ: నువ్వా-నేనా: సర్కారుకు నిమ్మగడ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top