Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సూర్యవంశం..ఏ సినిమా రీమేక్ తెలుసా..?

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సూర్యవంశం..ఏ సినిమా రీమేక్ తెలుసా..?

మామూలుగా సినీ ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు వస్తూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే.ఒక భాషలో వచ్చి మంచి విజయం సాధించిన సినిమాలను వేరొక భాషల్లోకి ఇతర దర్శకులు తెరకెక్కిస్తూ కథలో కొన్ని మార్పులు చేసి తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకుంటూ వుంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన రీమేక్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలా రీమేక్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో చిత్ర పరిశ్రమలో రీమేక్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. తెలుగు సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడం లేదా ఇతర భాషల్లో సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ ఉంటారు.



అయితే ఇలా రీమేక్ చేసిన సినిమాల్లో ఒకటి సూర్యవంశం.

వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసిన సూర్యవంశం సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సృష్టించింది ఈ సినిమా. ఇక ఈ సూర్యవంశం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ న కు వెంకటేష్ ను ఎంతగానో దగ్గర చేసింది. ఓవైపు తండ్రి పాత్రలో మరో వైపు కొడుకు పాత్రలో అందరికీ ఆదర్శంగా నిలిచే లా వెంకటేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు వెంకటేష్.

అదే సమయంలో ఊరు నుంచి వెలివేయబడిన వెంకటేష్ ఎలాంటి చదువు లేకున్న భార్య ప్రోత్సాహంతో పెద్ద బిజినెస్ మేన్ గా ఎలా ఎదిగాడు సినిమాలో చూపిస్తూ ఉంటారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు అంటూ నిరూపిస్తాడు ఈ సినిమాలో వెంకటేష్. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ పండించడంలో వెంకటేష్ కి ఎవరూ సాటి లేరు అనే చెప్పాలి. అందుకే సూర్య వంశం సినిమాలో వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసి ఎంతగానో ఆకట్టుకున్నాడు. కాగా ఈ సూర్యవంశం సినిమా తమిళ రీమేక్. తమిళంలో కూడా ఈ సినిమాకు సూర్య వంశం అనే పేరు ఉంది. అటు తమిళంలో కూడా మంచి విజయం సాధించింది ఈ సినిమా.



పింఛన్ల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం.... వారి పేర్లు తొలగింపు...?

కర్నూలులో కరోనా విలయతాండవం... 600కు చేరువలో కేసులు...?

ఇక నుండి వారికీ మాత్రమే రైతు బందు... కేసీఆర్ కీలక నిర్ణయం..?

బిగ్ బ్రేకింగ్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల లెక్కలివే..!

తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా... కేసులు పెరగడానికి కారణాలేమిటంటే...?

తెలంగాణ బాండ్లు.. హాట్‌కేక్‌లు..!

పవన్ కళ్యాణ్ కెరీర్ మలుపుతిప్పిన ఆ సూపర్ హిట్ మూవీ, రీమేక్ అనే విషయం మీకు తెలుసా.....??

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald