Dailyhunt
టాలీవుడ్‌కు షాక్ ఇచ్చిన కయాదు స్టేట్‌మెంట్!

టాలీవుడ్‌కు షాక్ ఇచ్చిన కయాదు స్టేట్‌మెంట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి గ్లామర్ అండ్ టాలెంట్‌తో ఎంట్రీ ఇచ్చి, కుర్రకారు గుండెల్లో 'డ్రాగన్' వేగంతో దూసుకెళ్తున్న భామ కయాదు లోహార్. తమిళ చిత్రం 'డ్రాగన్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు తెలుగులోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉంది.
ఇటీవల మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన 'ఫంకీ' (Funky) చిత్రంతో పలకరించిన కయాదు, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా వార్తల్లో మాత్రం నిలుస్తోంది. తాజాగా తన సినిమాల వైఫల్యాలపై ఈ ముద్దుగుమ్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

తెలుగులో తాను నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంపై కయాదు చాలా ప్రాక్టికల్‌గా, ఒక రకంగా సెటైరికల్‌గా స్పందించింది. "సినిమా రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు. నేను నా వంతు ప్రయత్నం చేశాను, కానీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి" అని పేర్కొంటూనే, ఆ సినిమాల వైఫల్యాల గురించి కూర్చుని బాధపడేంత తీరిక తనకు లేదని అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.చేతినిండా ప్రాజెక్టులు ఉన్నప్పుడు పాత సినిమాల గురించి ఆలోచించడం సమయం వృధా అన్నట్లుగా ఆమె అభిప్రాయపడింది. మలయాళం మరియు ఇతర పరిశ్రమల్లో తనకు మంచి గుర్తింపు లభిస్తోందని, అక్కడ వరుస అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది. సాధారణంగా హీరోయిన్లు ఫ్లాప్ వస్తే నిరాశ చెందుతారు, కానీ కయాదు మాత్రం తన బిజీ షెడ్యూల్‌ను సాకుగా చూపిస్తూ చాలా లైట్ తీసుకోవడం గమనార్హం.

టాలీవుడ్ ఫ్లాపులను లెక్కచేయని ఈ భామ, ప్రస్తుతం నేచురల్ స్టార్నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' (The Paradise) చిత్రంలో నటిస్తోంది.నాని లాంటి మినిమమ్ గ్యారెంటీ హీరోతో చేస్తున్న ఈ సినిమా కయాదు కెరీర్‌కు టాలీవుడ్‌లో పెద్ద బ్రేక్ ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.తాజాగా ఈ బ్యూటీ నటించిన ఒక మలయాళ చిత్రం తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగానే ఆమె టాలీవుడ్ సినిమాలపై ఈ తరహా వ్యాఖ్యలు చేసింది. ఒక చోట తలుపు మూసుకున్నా, మరోచోట అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నప్పుడు పాత వాటిని తలుచుకోకూడదన్నదే తన సిద్ధాంతమని ఆమె చెప్పకనే చెప్పింది.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald