Wednesday, 20 Jan, 5.00 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
టాలీవుడ్లో ఈ టాప్ 10 మూవీస్ కి మొదట ఏ టైటిల్ పెట్టారో తెలుసా..??

ఒక సినిమాకు కథ అనేది ఎంత ముఖ్యమో.. ఆ సినిమాకి టైటిల్ కూడా అంతే ముఖ్యం.. టైటిల్ సినిమా కథకు తగ్గట్టు ఉంటే ప్రేక్షకులు సినిమాపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు.. అలా కొన్ని సినిమాలు ముందు ఒక పేరుతో మొదలయ్యే తర్వాత పేరు మారాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

#1.మిర్చి..
మిర్చి సినిమా పేరు మొదట "వారధి" అని అనుకున్నారు. తర్వాత మిర్చి గా మార్చారు...

#2 .అత్తారింటికి దారేది..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ అత్తారింటికి దారేది సినిమా పేరు ముందు " సరదా " అని అనుకున్నారు...

#3.స్పైడర్..
సూపర్ స్టార్ మహేష్ బాబు - ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ సినిమా కి ముందు "ఏజెంట్ శివ" టైటిల్ గా అనుకున్నారు.. #4.అర్జున్ సురవరం..
నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన అర్జున్ సురవరం సినిమా పేరు మొదటి "ముద్ర" అని అనౌన్స్ చేశారు. ఇదే పేరుతో కొన్ని పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. తర్వాత టైటిల్ తొందరగా రిజిస్టర్ అవ్వట్లేదు అని అర్జున్ సురవరం గా మార్చారు అని నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు..

#5.ఒక్కడు..
ఒక్కడు సినిమాకి మొదట "అతడే ఆమె సైన్యం" అనే టైటిల్ అనుకున్నారు. తర్వాత ఒకడు అని చేంజ్ చేశారు...

#6.లైగర్..
విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోతున్న లైగర్ సినిమాకి మొదట "ఫైటర్" అనే టైటిల్ అనుకున్నారు...

#7.ఖుషి..
ఖుషి సినిమాకి మొదట "చెప్పాలని ఉంది" అనే టైటిల్ అనుకున్నారు. తర్వాత ఖుషి గా మార్చారు...

#8.నాగవల్లి..
విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం నాగవల్లి.. చంద్రముఖి కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకి మొదట "చంద్రముఖి-2" అనే టైటిల్ అనుకున్నారు..

#9.డియర్ కామ్రేడ్..
విజయ్ దేవరకొండ, రష్మీక కాంబినేషన్లో వచ్చిన మూవీ డియర్ కామ్రేడ్.. ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలో ఒకసారి డైరెక్టర్ భరత్ కమ్మ మాట్లాడుతూ డియర్ కామ్రేడ్ సినిమా "డియర్ లిల్లీ" అనే టైటిల్ అనుకున్నారని చెప్పారు..

#10. 100%లవ్..
సుకుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య, తమన్నా కలిసి నటించిన చిత్రం 100%లవ్..ఈ సినిమాలో మహాలక్ష్మి ఎక్కువగా వాడే "దట్ ఈజ్ మహాలక్ష్మి" అనే పదం టైటిల్ అనుకున్నారు. ఇప్పుడు అదే పేరుతో తమన్నా హీరోయిన్ గా క్వీన్ రీమేక్ రాబోతోంది...!!

"ముద్దు పెట్టలేదని నన్ను రిజెక్ట్ చేసింది".. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించిన అక్షయ్ కుమార్..!!

ఆ సామాజిక వర్గం కూరలో కరివేపాకా .... వైసీపీ మీద గుస్సా..?

ప్రపంచానికి మరో పెను ముప్పు...?

తిరుపతిలో వైసీపీకి పెద్ద గండమే!

తెలంగాణాలో నిరుద్యోగ భృతి రావాలంటే... కచ్చితంగా...!

ఏపీకి ప్రత్యేక హోదా ....ఇంకా గుర్తుందా...?

రాజధాని రైతులపై గల కేసులను కొట్టేసిన హైకోర్ట్...

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top