Tuesday, 04 Aug, 4.00 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ద్విభాషా చిత్రంలో.. పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌?

లోకేష్ కనగరాజ్ డైరెక్టు చేస్తున్న మాస్టర్ చిత్రంలో విజయ లీడ్ రోల్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రబలక ముందు ఏప్రిల్ 9న షెడ్యుల్‌ను రూపొందించారు. అనంతరం కరోనా మహమ్మారి బయటికి వచ్చింది. దీంతో ఆ మహమ్మారి రీత్యా రిలీజ్‌కు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మాస్టర్ చిత్రాన్ని డిజిటల్‌లో ఎట్టి పరిస్థితిలోనూ విడుదల చేయబోనని కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడించారు. విజిల్‌తో ఊపుమిదున్న విజయ్, తెరపై మరొకసారి కనువిందు చేయనున్నాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ డైరెక్టర్ గురించి ఒక ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. అయితే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన తదుపరి ద్విభాష చిత్రానికి గాను మైత్రీ మూవీస్ మేకర్స్ వారితో కామిట్ అయినట్లు తెలిసింది. ఈ సినిమా తెలుగు, తమిళల్లో రూపొందనుంది.

ఈ చిత్రం కోసం పవన్ కల్యాణ్‌, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లను సంప్రదిస్తున్నారు. వారిలో ఒకరితో లీడ్ రోల్ చేయించనున్నట్లు తెలిసిందే. పవన్ కల్యాణ్, వకిల్ సాబ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సర్కారు వారి పాట చిత్రంతో మహేష్ , రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్ర షూట్ చివరి దశలో ఉంది. అవి పూర్తయితే కానీ ఏ నిర్ణయం తీసుకోలేరు. వారు ఒప్పుకుంటే టాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో భారీ ప్రాజెక్టు కానుంది. దీనిపై లోకేష్ కనగరాజ్ గానీ, ప్రొడక్షన్ హౌస్ గానీ అధికారికంగా ప్రకటించలేదు. అఫీషియల్ ప్రకటన కోసం ఎదురు చూడాల్సిందే. మాస్టర్ చిత్రంలో విజయ సేతుపతి, మళవిక మోహనన్‌, ఆండ్రే జెరిమై కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మాస్టర్ చిత్రంలోని పాటలు ఇప్పటికే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సాంగ్స్‌ల విషయంలో ప్రత్యేకతను చాటుకుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుద్ధ రవిచంద్రన్ సమకూరుస్తున్నాడు. ఇంటర్‌నెట్‌లో పాటలు ఇప్పటికే హల్‌చల్ చేస్తున్నాయి. ఓరు.. కుట్టి.. కథేయ్‌., వాఠి కమింగ్., పాటలు ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. కరోనా మహమ్మారి రీత్యా ఇటీవల తమిళనాడు ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లను తెరవకూడదని ఆదేశాలు జారీ చేసింది.

ఒకటి కాదు, ఏకంగా ఆ రెండిటితో పవన్ డబుల్ ధమాకా ఖాయమట ......??

బుల్లితెర పెద్ద కష్టాలు.. నిర్మాతల జేబులకు చిల్లులు వేస్తున్న కరోనా.. ?

చెవిలో చిన్నమాట: కరోనా శవాలు మాట్లాడుతున్నాయ్‌!!

డేంజర్.. తెలంగాణలో కరోనాను గాలికి వదిలేశారా...?

జగన్ సర్కార్ మూడు రాజధానుల ఆమోదం... ఏపీలో రియల్ ఎస్టేట్ ఢమాల్...?

మహేష్ మూవీ లో ఫిదా పిల్ల ఛాన్స్ కొట్టేసిందా .....??

వాటర్ బాటిల్ కన్నా కరోనా వ్యాక్సిన్ ధర తక్కువ... డాక్టర్ కృష్ణ కీలక వ్యాఖ్యలు...?

ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siraj
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top