Wednesday, 05 Aug, 3.30 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
టెక్నాలజీ: కేవలం రూ.10 వేలలోపే `రెడ్ మీ 9 ప్రైమ్` విడుదల!!

భారత్‌లో మొబైల్ మార్కెట్‌లో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చి సందడి చేస్తున్నారు. అద్భుతమైన ఫీచర్లు, ఆకట్టుకునే ధర్లతో ఎన్నో ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక మొబైల్ మార్కెట్‌లో పెను సంచలనంగా మారిన రెడ్ మీ తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అదే రెడ్ మీ 9 ప్రైమ్. వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 5020 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రెడ్ మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరింయట్లలో లాంచ్ అయింది.

రెడ్ మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ స్పెషిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఐపీఎస్ డిస్ ప్లేను ఇందులో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ పై ఈ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. కెమెరా విషయానికి వస్తే.. రెడ్ మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. అందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగా పిక్సెల్ డెప్త్ షూటర్ అందించింది రెడ్‌మీ.

ముందువైపు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు. 5020 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఇందులో ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయర్ సిమ్ సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ధర విషయానికి వస్తే.. 4 జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ.9,999గా, 4 జీబీ+128 జీబీ వేరియంట్ ధరను రూ.11,999గా నిర్ణయించింది రెడ్‌మీ. స్పేస్ బ్లాక్, మింట్ గ్రీన్, మాటే బ్లాక్, సన్ రైజ్ ఫ్లేర్ ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. కాగా, రెడ్ మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ సేల్ ఆగస్టు 6వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రైమ్ డే సందర్భంగా జరగనుంది.

బ్రేకింగ్: పురంధరేశ్వరి అరెస్ట్...!

రాజమౌళిని ఆస్థికుడు గా మార్చిన కరోనా !

రాజ్యసభలో డ్రాగన్ పై రెచ్చిపోయిన రాజ్​నాథ్.. నిజమేంటి ?

ఓ అభిమానికి వాయిస్ మెసేజ్ చేసిన రజనీకాంత్.. ఎందుకంటే.. ?

ఎస్బిఐ డెబిట్ కార్డ్ వాడుతున్నారా.. అయితే మీకు 20 లక్షల ఇన్సూరెన్స్.. తప్పక తెలుసుకోండి..?

తస్మాత్ జాగ్రత్త.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు..?

అవార్డుపై మూత్ర విసర్జన చేసిన ర్యాపర్​ కేన్​ వెస్ట్​..!

భయ పడకండి మీకు మేమున్నాం:

అవినీతి అధికారులు మిమ్మల్ని జలగల్లాగ పీడిస్తున్నారా? మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరితో మొరపెట్టుకోవాలో మీకు తెలియడంలేదా? ఇండియా హెరాల్డ్ నిర్భయంగా మీ ఘోషను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళుతుంది. మీ బాధను పూర్తి వివరాలు, ఆధారాలతో సహా nofear@indiaherald.com కు నేడే పంపించండి.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Kavya Nekkanti
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top