కరోనా దెబ్బకు గత ఏడాది పెద్దగా సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ఈ ఏడాది పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కలిపి ఇంతవరకు డబ్బింగ్ అలాగే స్ట్రయిట్ సినిమాలు ఏకంగా 55 విడుదల అయ్యాయి. ఈ మార్చి లోనూ సినిమాల విడుదలలో అదే జోరు కనిపించబోతోంది అని అంటున్నారు సినీ ట్రేడ్ వర్గాల వారు. గత ఏడాదిలో దాదాపు పది నెలలు థియేటర్లు మూసి ఉండటంతో ఇప్పుడు అన్ని సినిమాలు థియేటర్ల ముందు క్యూ కడుతున్నాయి. గత వారంలో ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదల కాగా, ఆ రికార్డ్ ను మళ్ళీ బ్రేక్ చేస్తూ ఈ మార్చి మొదటి వీకెండ్ లో పదకొండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.
అందులో రెండు డబ్బింగ్ సినిమాలు కాగా మిగతావన్నీ తెలుగు సినిమాలే. ఆ సినిమాల విషయానికి వస్తే సందీప్ కిషన్ నటించిన ఎ1 ఎక్స్ ప్రెస్ తో పాటు ఏ అనే సినిమా, అలాగే రాజ్ తరుణ్ పవర్ ప్లే తో పాటు ప్లే బ్యాక్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఇక గత వారం రావాల్సిన రాజేంద్ర ప్రసాద్ క్లైమాక్స్ ఈ శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఇక టెలివిజన్ స్టార్ సాగర్ నటించిన 'షాదీ ముబారక్' కూడా అదే రోజున రిలీజ్ అవుతుంది.
ఇక విజయవాడ హత్య రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన నందమూరి తారకరత్నమూవీ దేవినేని కూడా శుక్రవారం రిలీజ్ కాబోతోంది. పిల్లల్నిఅలరించే విధంగా తెరకెక్కిన శ్రీ పరమానందయ్య శిష్యుల కథ కూడా అదే రోజున త్రీడీలో వస్తుంది. దీనితో పాటు యాంకర్ రవి కీలక పాత్ర పోషించిన 'తోట బావి', విజయ్ సేతుపతి తమిళ్ డబ్బింగ్ సినిమా 'విక్రమార్కుడు', యశ్ కన్నడ డబ్బింగ్ సినిమా 'గజకేసరి' కూడా శుక్రవారం వస్తున్నాయి.
భర్త క్రాఫ్ చూసి ఆనందపడిన భార్య.. కానీ అంతలోనే..?
ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!
ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?
పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు
శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?
షర్మిలను మోసం చేసిన జగన్
ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti

