అయితే వంశి, చిన్నారెడ్డి పేర్లను పరిశీలించిన హైకమాండ్... చిన్నారెడ్డి పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. వంశీ యువకుడు అయినందున.. ఆయనకు భవిష్యత్ లో మంచి అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టబద్రుల స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ను పోటీకి దింపుతారని భావిస్తున్నారు. ఈ స్థానం నుంచి ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, విద్యార్థి నాయకుడు మానవతారాయ్ పలువురు పోటీ పడుతున్నారు. అయితే తనకు మరో రెండు పదవి కాలం ఉన్నా... టీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు రాములు నాయక్.దీంతో అతనికే అవకాశం ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించారని గాంధీభవన్ వర్గాల సమాచారం.