Tuesday, 28 Sep, 10.16 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

భారత దేశం వార్తలు
టీటీడీలో ఉద్యోగుల అక్రమాలపై ఈవో ఫోకస్‌!

తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులు, ఇప్పటివరకు చర్యలు లేని కేసులపై టీటీడీ ఈవో దృష్టి సారించారు. దీంతో అక్రమాలకు పాల్పడిన, పాల్పడుతున్న ఉద్యోగులు, సిబ్బంది వెన్నులో వణుకు పుడుతోంది. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే భక్తులకు సేవలందించేందుకు దాదాపు 7 వేల మంది శాశ్వత ఉద్యోగులతో పాటు 15 వేల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది టీటీడీలో విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీవారి సేవలో ఉంటూనే కొందరు ఉద్యోగులు ఏకంగా స్వామి వారికే శఠగోపం పెడుతుండటంతో వీరిపై టీటీడీ యాజమాన్యం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. గతేడాది అక్టోబరులో టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహార్ రెడ్డి.. టీటీడీలో ఏళ్ల కొద్దీ పెండింగులో ఉన్న కేసులతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగుల నేరం రుజువైనప్పటికీ.. వారిపై చర్యలు తీసుకోని కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే 2009వ సంవత్సరంలో వెలుగుచూసిన ఆర్జిత సేవా టిక్కెట్ల బల్క్ బుకింగ్ కేసులో ఏడుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి డిస్మిస్ చేయడం కాకుండా.. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఇప్పటికే రిటైర్డ్‌ అయిన ఇంకొందరి ఉద్యోగుల ఇంక్రిమెంట్లలో కోతలు విధించారు. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉన్న టీటీడీ యాజమాన్యం.. తాజాగా హౌస్ బిల్డింగ్ లోన్‌లో అవకతవకలకు పాల్పడిన 49 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడిది టీటీడీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇటీవల వరుసగా అక్రమాలకు పాల్పడుతున్న టీటీడీ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటున్న ఈవో జవహార్‌రెడ్డి.. విధులు నిర్వర్తిస్తూ అక్రమ ఆరోపణలు ఎదుర్కొని నేరం రుజువైనా చర్యలు తీసుకోని మరో 21 మంది ఉద్యోగులను కూడా ఈ మధ్య కాలంలోనే డిస్మిస్ చేశారు. అలాగే మరికొంత మంది ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకున్నారు. తాజాగా ఈ ఘటనపై దృష్టి సారించి.. లేని బిల్డింగ్‌ను ఉన్నట్లుగా తప్పుడు పత్రాలు చూపించి లోన్ పొందిన వారిపై, వారికి లోన్ జారీ చేసే సమయంలో పత్రాలను పరిశీలన జరపకుండా సరైన రీతిలో వ్యవహరించని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొదటి విడతలో షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో డిప్యూటీ ఈవో స్థాయి అధికారి నుంచి అటెండర్ స్థాయి ఉద్యోగి వరకు ఉండటం దుమారం రేపుతోంది. వీరిచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది యాజమాన్యం.

నయనతార శింబు లు ఎందుకు విడిపోయారో తెలుసా ?

పవన్ వర్సెస్ పోసాని: నా దెబ్బకు కేశినేని నాని ఇంటికి వెళ్ళిపోయాడు

ఇరిగేషన్ అంటే తెలియదు: జగన్ పై చంద్రబాబు

రాజమౌళి కి RRR కత్తి మీద సాములాంటిదే!!

బిగ్ బాస్ 5: ఈ వారం స్టార్ హీరో ఎంట్రీ ?

ఈ మధ్య కొందరికి అనారోగ్యంతో మతిస్థిమితం వచ్చింది : పోతిన వెంకట మహేష్

ఎక్కడున్నాయి వైసిపి గ్రామ సింహాలు..పవన్ సంచలనం.!

సిఎం కెసిఆర్ ఒక బ్రోకర్ ?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top