Wednesday, 27 Jan, 1.58 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
ట్వీట్లతోనే కోట్లు తెచ్చిపెడుతున్న ఎలాన్ మాస్క్.. ఈ సారి మరో కంపెనీపై..

ఇంటర్నెట్ డెస్క్: అడగందే అమ్మయినా అన్నం పెట్టదంటారు. కానీ ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్ సంస్థల అధినేత ఎలాన్ మాస్క్ మాత్రం కొన్ని కంపెనీలకు అడక్కుండానే వరాలు ప్రసాధిస్తున్నాడు. అది కూడా చిన ట్వీట్లతో. ప్రస్తుతం ఎలాన్ మాస్క్ ఒక్క మాట చెబితే చాలు వినడానికి ప్రపంచంలోని అనేకమంది సిద్ధంగా ఉన్నారు. వాట్సాప్ విషయంలో ఇటీవల ఆయన చేసిన ఒక్క ట్వీట్ ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ కు చెమటలు పట్టించింది. అయితే మస్క్ మళ్లీ అలాంటిడే మరో ట్వీట్ చేశాడు.

అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పేస్ ఎక్స్, విద్యుత్ వాహనాల సంస్థ టెస్లా ద్వారా ఆయన టెక్ రంగంలో ఇతరులెవ్వరికీ సాధ్యం కానీ క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఆయన చెప్పే ప్రతి విషయానికీ ఎంతో పాపులారిటీ ఏర్పడింది. ఈ మధ్య సిగ్నల్ యాప్ వాడాలని ఆయన చేసి ట్వీట్ ఆ యాప్ కు మిలియన్లలో యూజర్లను పెంచింది. ఇక ఇప్పుడు తాజాగా మరో కంపెనీని పొగుడుతూ ఎలాన్ ఓ ట్వీట్ చేశాడు. దీంతో ఆ కంపెనీకి కోట్లకు కోట్లు వచ్చి పడుతున్నాయి. ఎలాన్ ట్వీట్ తర్వాత ఆ కంపెనీ షేర్ల విలువ ఒక్కసారిగా పెరిగింది.

ఎలాన్ మస్క్ తన పెంపుడు కుక్క కోసమని ఇట్సీ అనే ఈ-కామర్స్ సంస్థ ద్వారా ఉన్నితో తయారు చేసిన 'మార్షియన్ హెల్మెట్'ను ఆర్డరిచ్చారు. ఆ తరువాత మార్షియన్ హెల్మెట్ ఫొటోలను ట్వీటర్ లో షేర్ చేశాడు. 'ఇట్సీ అంటే నాకు ఒకింత ఇష్టం' అని పేర్కొన్నాడు. అంతే ఇట్సీ షేర్ల ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో రికార్డు స్థాయిలో ఇట్సీ షేర్ ధర 8 శాతానికి ఎగబాకింది.

ఎలాన్ ట్వీట్ తో తమ కంపెనీకి ఊహించని లాభాలు రావడంతో సదరు సంస్థ కూడా ఉబ్బితబ్బిబైపోయింది. 'మీరంటే మాకూ ఎంతో ఇష్టం' అంటూ వెంటనే రిప్లై ఇచ్చింది. అయితే ఇట్సీ సంస్థకు అంతకు అంతకు ముందు నుంచే మార్కెట్‌లో మంచి గుర్తింపు వుంది. ఎందరో చేనేత కళాకారులు తమ వస్తువులను ఇట్సీ ద్వారా అమ్ముతుంటారు. వీరిలో అధికశాతం మహిళలే ఉండడం ఈ సంస్థ ప్రత్యేకత.

" style="height: 209px;">



కేజిఎఫ్ 2 మార్కెట్ మాములుగా లేదుగా.....

మరో సారి బాక్సాఫీస్ లో షేక్ చేయడానికి సిద్దమైన 'జైలవకుశ'.. వామ్మో టికెట్లేంటి ఇలా అమ్ముడుపోతున్నాయి..

'అంటే సుందరానికీ' ఆగిపోతుందా.. వివాదంలో నాని సినిమా..!

పవన్ కల్యాణ్ కు చిరు మద్దతు.. మళ్లీ ఒక్కటి కానున్నారా?

హన్సిక సినిమాల్లోకి రావడానికి ఆ పని చేసిందా.? నాలుగేళ్లలో ఇంత మార్పుకు కారణం అదేనా..?

జగడ్డ: జగనోరుపై అన్నిపార్టీలు మూకుమ్మడి దాడి...ఓటమి లాంఛనమే...!

జగడ్డ: జగనోరికి రియల్ దెబ్బ గుంటూరులో గట్టిగా పడుతుందా...?

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top