Thursday, 04 Mar, 9.30 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
వైరల్ వీడియో : నటకిరీటి డబ్బింగ్.. డెడికేషన్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్..?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. దాదాపు 4 దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నారు రాజేంద్రప్రసాద్. విలక్షణమైన పాత్రలకు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఇక ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను డాక్టరేట్ కూడా కూడా సొంతం చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా నటకిరీటి అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్.

అయితే ఇప్పటికి చిన్న పాత్రలు పెద్ద పాత్రలు అనే తేడా లేకుండా.. నటనకు ప్రాధాన్యం ఉన్న అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం అన్ని పాత్రలకూ సూట్ అయ్యే విధంగా నటిస్తూ అంతకంతకు అభిమానులను పెంచుకుంటూనే పోతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో సేవలందిస్తున్న నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికి కూడా పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ.. అన్ని విషయాల్లో కూడా డెడికేషన్ చూపిస్తూ ఉంటారు.

నటకిరీటిగా కోట్లాదిమంది ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటారు రాజేంద్ర ప్రసాద్. ఇటీవలే విష్ణు హీరోగా తెరకెక్కుతున్న గాలి సంపత్ అనే సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించాడు నటకిరీటి రాజేంద్రప్రసాద్. అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అనే విషయం తెలిసింది. మార్చి 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఇక ఈ సినిమాకు సంబంధించి విభిన్నమైన పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ ఎంతో కష్టమైన డబ్బింగ్ చెబుతూ ఎంతగానో డెడికేషన్ చూపించిన ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. రాజేంద్రప్రసాద్ పాత్ర సినిమాకి హైలైట్గా నిలుస్తుందని చెబుతున్నాడు.

" style="height: 224px;">



నిమ్మగడ్డ అది కూడా పూర్తి చేస్తారా.. ?

ఏపీలో ఆ నలుగురు మంత్రులదే రాజ్యం... బాలయ్య సంచలన వ్యాఖ్యలు

వైరల్ :కేవలం 20 చెట్లతో 36 లక్షలు సంపాదన..?

అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం

కరోనాతో గుండెజబ్బులు... కొత్త విషయం వెలుగులోకి..

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top