ముఖ్యాంశాలు
విజయ్ దేవరకొండ "లైగర్"... రౌడీ ఫ్యాన్స్ హంగామా..!!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ప్రారంభమైన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అందువల్ల ఈ సినిమాకు సంబంధించి ఏ విధమైన అప్డేట్ వెలువడలేదు. దాంతో ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ కోసం రౌడీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఎందుకంటే హీరోలను ఓ రేంజ్ లో చూపించే మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇక విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అర్జున్ రెడ్డి సినిమాతో మాస్ లోను, యూత్ లోనూ బీభత్సమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఒక్క సినిమాల పరంగానే కాక తన డిఫరెంట్ ఆటిట్యూడ్ తో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు విజయ్.. దీంతో వీరిద్దరి కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. అంతేకాక సినిమా టైటిల్ ని కూడా అధికారికంగా ప్రకటించింది. 'లైగర్' అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఓవైపు పులి మరోవైపు సింహం మధ్యలో విజయ్ తో పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన రౌడీ ఫాన్స్ అప్పుడే హంగామా మొదలెట్టేశారు.
వినైల్ పోస్టర్స్ ను కూడళ్ళ లో పెట్టి దానికి పాలాభిషేకం చేసిన వారు కొందరైతే, ఆ పోస్టర్ ముందు కేక్ కట్ చేసి... సంబరాలు జరుపుకున్న వాళ్ళు మరికొందరు. అంతేకాదు... సినిమా విడుదల సమయంలో థియేటర్ల దగ్గర బాణసంచా కాల్చి, డప్పులతో హంగామా సృష్టించినట్టే... 'లైగర్' ఫస్ట్ లుక్ పోస్టర్ ముందూ కొందరు కుర్రాళ్ళు తీన్ మార్ స్టెప్పులూ వేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న 'లైగర్'లో విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడే ఇంత సందడి చేస్తున్న అభిమానులు మరి రేపు రిలీజ్ టైమ్ లో ఇంకెంతగా జోరును ప్రదర్శిస్తారో చూడాలి.
తెలంగాణలో కొత్తగా ఆరు ఎయిర్‌పోర్టులు...ఏఏఐ పచ్చజెండా..
'లవ్ స్టోరీ' మాములుగా కాదట ...... ఫరెవర్ స్టోరీలా నిలిచిపోనుందట.....??
ఎన్టీఆర్ ఘాట్ దగ్గర లక్ష్మీపార్వతి ప్రకటనకు షాక్ అయిన నందమూరి ఫ్యామిలీ !
హెరాల్డ్ సెటైర్ : బాబాయ్ ని ఉతికి ఆరేసిన అమ్మాయ్
నేటి ఈ స్టార్స్ అంతా ఒకప్పుడు సీరియల్స్ లో నటించారన్న సంగతి తెలుసా ?
ఒకే సంవత్సరం రెండు సినిమాలతో చిరంజీవి రెడీ?
దిమ్మతిరిగేలా రిపబ్లిక్‌డే ఆఫర్లు.. కొంటే ఇప్పుడే కొనాలి..!?
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald