Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ సీఎం అవ్వడం పై అసూయ లేదు.. రజనీకాంత్ కామెంట్స్..!

విజయ్ సీఎం అవ్వడం పై అసూయ లేదు.. రజనీకాంత్ కామెంట్స్..!

మిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే పార్టీ అధినేత, హీరోవిజయ్దళపతి భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నారు. తమిళనాడు సీఎంగా ప్రస్తుతం బాధ్యతలు స్వీకరించిన సంగతి కూడా తెలిసిందే.
అయితే విజయ్ గెలుపు పైన చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికే స్పందించారు. తాజాగా విజయ్ గెలుపు పట్ల తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎయిర్ పోర్టులో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వెళ్ళిపోయారు. దీంతో విజయ్ సీఎం అవ్వడంపై రజనీకాంత్ కి ఇష్టం లేదంటు చాలామంది ట్రోలింగ్ కూడా చేశారు.

ఈరోజు మీడియా ముఖంగా రజనీకాంత్ ఈ విషయం పైన స్పష్టత ఇచ్చారు.. రజనీకాంత్ మాట్లాడుతూ రాజకీయాలలో విజయ్ సాధించిన విజయం గతంలో తమిళనాడులో ఎంజీఆర్, అటు ఆంధ్రాలో నందమూరి తారక రామారావు సాధించిన విజయాల కంటే చాలా పెద్దది అంటూ తెలిపారు. ఆ కాలంలో ఆ ఇద్దరు
మహా నాయకులు ఎదుర్కొన్న రాజకీయ పరిస్థితుల కంటే ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ పరిస్థితులను విజయ్ ఎదుర్కొని నిలబడడం విశేషం అంటూ తెలియజేశారు.

కమలహాసన్ సీఎం అయితే అసూయపడతానని విజయ్ తనకు సమవుజ్జి కాదని, విజయ్ కి తనకు 25 ఏళ్ల తేడా ఉందని, ఒకవేళ తాను పార్టీ పెడితే కచ్చితంగా గెలిచే వాడినని, తనకు మాజీ సీఎం స్టాలిన్ కూడా మంచి స్నేహితుడే అని అందుకే ఓడిన తర్వాత కూడా వెళ్లి కలిశానని తెలియజేశారు రజనీకాంత్. విజయ్ సీఎం కాకుండా తాను ఎప్పుడూ కూడా అడ్డుపడలేదని అలాంటి నీచ రాజకీయాలను తాను చేయనంటూ కూడా తెలియజేశారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు అందుకే
విజయ్ గెలిచారు అంటూ తెలిపారు. గతంలో కూడా రజనీకాంత్ పార్టీ పెట్టాలని అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ఈ విషయంపై అక్కడ ప్రజల నుంచి కూడా ఆయనకు మద్దతు భారీగానే లభించింది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల పార్టీ ప్రకటన పైన వెనక్కి తగ్గారు రజినీకాంత్.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald