రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. ఇటీవల ఈసినిమా నుండి రానా ప్రీ లుక్ విడుదలకాగా కొద్దిరోజుల క్రితం సాయి పల్లవి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇక రేపు ఈసినిమా నుండి మరో అప్డేట్ నుండి రానుందట. బహుశా రానా ఫస్ట్ లుక్ ను కానీ టీజర్ విడుదల డేట్ కానీ చెప్పేలా వున్నారు. రేపు ఉదయం 9గంటలకు ఈ అప్డేట్ ను రివీల్ చేయనున్నారు.
నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్షన్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్సివ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా సాయి పల్లవి, నక్సలైట్ గా కనిపించనుంది వీరితోపాటు మలయాళ నటి నందితా దాస్, ప్రియమణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇక రానా ఈసినిమా కన్నా ముందు అరణ్య తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కరోనా లేకుంటే ఏప్రిల్లోనే విడుదలకావాల్సి ఉండగా వాయిదాపడింది. ఆగస్టు లో ఈసినిమాను థియేటర్లోకి తీసుకురానున్నారు. ఈచిత్రం తరువాత రానా, తేజ తో సినిమా చేయనున్నాడు. మరోవైపు సాయి పల్లవి, విరాటపర్వం తోపాటు ప్రస్తుతం లవ్ స్టోరి లో కూడా నటిస్తుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటిస్తుండగా పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి.
క్రిష్ తెరకెక్కించిన అద్భుతం 'వేదం'కు 10 ఏళ్లు
సాహో డైరెక్టర్ సుజీత్ పెళ్ళి వెనక ప్రభాస్ ...?
నో డౌట్.. ఆ విషయంలో కేజ్రీవాల్ నే ఫాలో అవుతున్న జగన్..?
హెరాల్డ్ సెటైర్ : జేసి బాధేమిటో బయటకు చెప్పుకోలేకపోతున్నాడా ?
హెరాల్డ్ ఎడిటోరియల్ : ట్రంప్ లో పెరిగిపోతున్న టెన్షన్ ... డేట్ దగ్గరకు వచ్చేస్తోందా ?
హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కు వ్యతిరేకంగా ఎల్లోమీడియా ఎలా రెచ్చిపోతోందో తెలుసా ?
ఆరోగ్యం: కరెన్సీ నోట్ల ద్వారా కరోనా రాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే..!!
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Kancherla Mahender Reddy

