Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!

Telugu Bell 4 days ago

AamirKhan Marriage: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఆ వార్తల సారాంశం ఏంటంటే..

61 ఏళ్ల ఆమిర్ ఖాన్ మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. ఈ ప్రచారం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న ఈ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్.. తాజాగా గౌరీ స్ప్రత్ అనే మహిళతో ప్రేమలో పడ్డారని, వీరిద్దరూ త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రేజీ బాలీవుడ్ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ వివాహానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వెడ్డింగ్ డేట్ కూడా లీకై నెట్టింట చక్కర్లు కొడుతోంది. జులై 5న ఆమిర్ ఖాన్ తన నివాసంలోనే చాలా సింపుల్‌గా, ఎలాంటి హడావుడి లేకుండా ‘రిజిస్టర్ మ్యారేజ్’ చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులైన కొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. అయితే ఈ వెడ్డింగ్ రూమర్స్‌పై ఆమిర్ ఖాన్ టీమ్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిజానికి ఆమిర్ ఖాన్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యి విడాకులు కూడా తీసుకున్నారు. మొదట రీనా దత్తాను వివాహం చేసుకున్న ఆయన, ఆ తర్వాత కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే 2021లో కిరణ్ రావుతో కూడా విడాకులు తీసుకుంటున్నట్లు ఆమిర్ అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు 61 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell