Dailyhunt

Adivi Sesh: 'డెకాయిట్' నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

Telugu Bell 2 days ago

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపొందించిన చిత్రం 'డెకాయిట్'. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్‌కు రెడీ అవుతుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శేష్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా తన డ్రీమ్ అని, దీని కోసం తన టీమ్ అహోరాత్రులు కష్టపడ్డారని ఆయన గుర్తు చేసుకున్నారు.

READ ALSO: Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

ఈ సినిమా కోసం తన టీమ్ ఎంతగా కష్టపడిందో వివరిస్తూ శేష్ భావోద్వేగానికి గురయ్యారు. దర్శకుడు షనీల్ ఆరు రాత్రులు నిద్రలేకుండా పని చేశారని, ఇప్పటికీ ఆయన సినిమా అవుట్‌పుట్ కోసం శ్రమిస్తున్నారని చెప్పారు. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన షనీల్ ఈ విజన్‌ను నిలబెట్టడానికి ఎంతో తపన పడ్డారని, కానీ ఈ సెలబ్రేషన్‌లో పాలుపంచుకోవడానికి ఆయన ఇక్కడ లేకపోవడం బాధాకరమని అన్నారు. సింగర్ జోనిత గాంధీ గురించి మాట్లాడుతూ.. ఆమె ఆరు రాత్రులు నాన్-స్టాప్ గా డాన్స్ చేసిందని, తన మేకప్ టీమ్ వెళ్లిపోయినా తనను తాను పుష్ చేసుకుంటూ షూటింగ్‌లో పాల్గొందని కొనియాడారు. అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటనను కొనియాడుతూ.. ఇంటర్వెల్ సీన్‌లో ఆమె నటన పిచ్చెక్కిస్తుందని, ఈ సినిమాకు ఆమె ఒక హైలైట్ అని చెప్పారు. ‘గూఢచారి 2’ డైరెక్టర్ వినయ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కట్ చేశారని, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ అనే వ్యక్తికి ఈ సినిమాకు సంబంధం లేదు.. అయినా ఆయన వచ్చి ఈ సినిమాకు ఏదైనా చేయాల అని అడిగాడు.. అది నాపై ఆయనకు ఉన్న ప్రేమ అని చెప్పుకొచ్చారు. సినిమాపై ఉన్న ప్రేమ వల్లే వీరందరూ ఎమోషనల్ ఓనర్షిప్ తీసుకుని పని చేశారని శేష్ కృతజ్ఞతలు తెలిపారు.

“మీరు నా నుంచి సక్సెస్ చూశారు, ఫెయిల్యూర్స్ చూశారు. కానీ ఈ సినిమాలో మేము ఎంత ప్రేమను పెట్టి చేశామో చూస్తారు” అని శేష్ ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 10న సినిమా విడుదల కాబోతుందని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ డేట్ మారదని, ఇది ఆనెస్ట్ ఫిల్మ్ అని ఆయన ప్రామిస్ చేశారు. చివరగా తన స్పీచ్ మరికొంత సేపు కొనసాగితే స్టేజ్ మీదే ఏడ్చేస్తానని, అప్పుడు ‘శేష్ స్టేజ్ పై కన్నీళ్లు’ అని తంబ్నెయిల్స్ వచ్చేస్తాయని సరదాగా అంటూ తన స్పీచ్‌ను క్లోజ్ చేశారు.

READ ALSO: Sai Marthand: అడివి శేష్‌తో 'లిటిల్ హార్ట్స్' దర్శకుడి నెక్స్ట్ మూవీ.. అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell