Dailyhunt

అఫీషియల్: 'హాయ్ నాన్న' దర్శకునితో విజయ్.. స్ట్రైకింగ్ పోస్టర్ తో ప్రకటన!

Telugu Bell 3 weeks ago

న టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు రూట్ మార్చి సాలిడ్ లైనప్ ని సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ ప్రాజెక్ట్ లు రౌడీ జనార్ధన అలాగే రణబాలి అంటూ భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్న విజయ్ దేవరకొండ నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు అనౌన్స్ అయ్యింది.

తన మొదటి సినిమా హాయ్ నాన్న తోనే మంచి ఫేమ్ అందుకున్న దర్శకుడు శౌర్యువ్ తో ఇపుడు విజయ్ తన తదుపరి సినిమాని అనౌన్స్ చేయడం విశేషం. పైగా దీనిని ఒక స్ట్రైకింగ్ పోస్టర్ తో రివీల్ చేయడం విశేషం. విజయ్ అండ్ సినిమా గ్యాంగ్ అంతా తమ తమ ఆయుధాలతో కలిసి నడుస్తూ వస్తున్నట్టుగా ఇందులో కనిపిస్తున్నారు.

ఇక ఇందులో ఇంట్రెస్టింగ్ లైన్ కూడా ఉంది. 'ఇప్పటి కోపం అంతా ఒకప్పటి ప్రేమ' అంటూ చెబుతున్నారు. దీనితో వీరి కాంబినేషన్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రాబోతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి కూడా హేశం అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించనుండగా అదే హాయ్ నాన్న నిర్మాణ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు.

The put up అఫీషియల్: 'హాయ్ నాన్న' దర్శకునితో విజయ్.. స్ట్రైకింగ్ పోస్టర్ తో ప్రకటన! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell