Dailyhunt

Alia Bhatt: 'తుంబాడ్ 2'లో అలియా భట్.. హారర్ మైథాలజీలో క్రేజీ ఎంట్రీ!

Telugu Bell 6 days ago

బాలీవుడ్ వెర్సటైల్ నటి అలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్‌ను గడుపుతోంది. 'ఆల్ఫా' చిత్రంతో రెండేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆమె, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి 'లవ్ అండ్ వార్' చిత్రంలోనూ నటిస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, హారర్ మైథలాజికల్ వండర్ 'తుంబాడ్' సీక్వెల్‌లో అలియా ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తుంబాడ్ 2'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కోసం చిత్రబృందం గత కొంతకాలంగా అగ్ర కథానాయికల పేర్లను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆ పాత్ర కోసం అలియా భట్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో అలియా పోషించే పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథ మలుపు తిరగడానికి, సినిమాపై బలమైన ప్రభావం చూపడానికి ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే అలియా తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

సోహమ్ షా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీక్వెల్, మొదటి భాగం కంటే మరింత భయంకరంగా, ఉత్కంఠభరితంగా ఉండబోతోందట. అలియా లాంటి స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్టులో చేరడం సినిమాకు పాన్-ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ తీసుకురావడం ఖాయం. మైథాలజీ,హారర్ కలగలిపిన ఈ అడ్వెంచర్‌లో అలియా భట్ ఏ విధంగా మెప్పించబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell