Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Allu Arjun: విజయ్ స్థానంపై కన్నేసిన బన్నీ?

Telugu Bell 3 weeks ago

మిళనాడులో సినిమా, రాజకీయం విడదీయలేని బంధం, అందుకే అక్కడ టాప్ హీరో స్థానం కేవలం బాక్సాఫీస్ రికార్డులకు మాత్రమే పరిమితం కాదు, అది ఒక సామాజిక శక్తి అనే చెప్పాలి.

రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు సీనియర్ల కోటాలోకి వెళ్లడం, విజయ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, అజిత్ సినిమాల కంటే ఎక్కువ రేసింగుల మీదకి వెళ్ళడంతో ఇప్పుడు కోలీవుడ్ తదుపరి వారసుడి కోసం వెతుకుతోంది. ఈ రేసులో స్థానిక హీరోల కంటే పక్క రాష్ట్రం నుంచి వస్తున్న ‘పుష్పరాజ్’ స్పీడ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సూర్య, ధనుష్, కార్తీ వంటి హీరోలకు తమిళనాడులో బలమైన ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ, గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టలేకపోయాయి. శివకార్తికేయన్ (SK) వంటి యువ హీరోలు వేగంగా ఎదుగుతున్నా, విజయ్ రేంజ్ ‘మాస్ అప్పీల్’ అందుకోవడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. సరిగ్గా ఇదే గ్యాప్‌ను అల్లు అర్జున్ అందిపుచ్చుకుంటున్నారు.

అల్లు అర్జున్ కేవలం డబ్బింగ్ సినిమాలతో సరిపెట్టుకోకుండా, కోలీవుడ్ నాడి తెలిసిన టాప్ దర్శకులతో నేరుగా చేతులు కలుపుతున్నారు. షారుఖ్ ఖాన్‌కు ‘జవాన్’తో గ్లోబల్ హిట్ ఇచ్చిన అట్లీ, ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి ‘రాకా’ అనే భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకుల మాస్ పల్స్‌ను పట్టుకోవడం బన్నీకి సులువవుతుంది. కోలీవుడ్‌లో ప్రస్తుతం తిరుగులేని బ్రాండ్ LCU లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే కోలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ‘పుష్ప’ సిరీస్‌తో తమిళనాడులోని బి, సి సెంటర్స్ వరకు బన్నీ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు నేరుగా తమిళ దర్శకులతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు చేయడం ద్వారా, ఆయన కేవలం అతిథిగా కాకుండా, కోలీవుడ్ టాప్ ఛైర్‌లో ఒక వాటాదారుడిగా మారబోతున్నారు. విజయ్ వదిలేస్తున్న స్థానాన్ని భర్తీ చేయడం అంత సామాన్యం కాదు. కానీ అల్లు అర్జున్ ఎంచుకున్న దర్శకులు, ఆ ప్రాజెక్టుల భారీతనం చూస్తుంటే.. 2026 నాటికి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell