Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Anil Ravipudi : నేటి నుండి వెంకీ - కళ్యాణ్ రామ్ - అనిల్ ఆట షురూ

Telugu Bell 1 week ago

టాలీవుడ్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి.. గత కొన్నాళ్లుగా ప్రతి సంక్రాంతికి ఓ సినిమా రిలీజ్ చేసేలా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గతేడాది సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం', ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్‌ 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు అనిల్.

ఇక ఇప్పుడు వెంకటేష్‌, కళ్యాణ్ రామ్‌లతో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు.

ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అనిల్ రావిపూడి, ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేశారు. ఇటీవలె లాంఛనంగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒక సాంగ్‌తో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం కొత్త షెడ్యూల్ జులై 2 నుండి అనగా ఈ రోజు నుండి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో విక్టరీ వెంకటేష్ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాను ఎలాంటి బ్రేక్స్ లేకుండా నాన్‌స్టాప్‌గా షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. వచ్చే అక్టోబర్ నవంబర్ వరకు టోటల్ షూటింగ్‌ను పూర్తి చేయాలనేది ప్లాన్. అదే జోష్‌తో ఇప్పుడు షూటింగ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా.. కళ్యాణ్ రామ్ జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. ఈ క్రేజీ జోడీలతో వెండితెరపై అనిల్ చేసే మ్యాజిక్ మామూలుగా ఉండదని ఇన్‌సైడ్ టాక్. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నఈ సినిమా.. మ్యూజికల్ పరంగాను అదిరిపోతుందని అంటున్నారు. మరి అనిల్ రావిపూడి ఈసారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell