Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Anna Lezhneva: జిమ్'లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య

Telugu Bell 2 days ago

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన ఫిట్‌నెస్ జర్నీకి సంబంధించిన వివరాలను సైతం పబ్లిక్‌గా షేర్ చేసుకున్నారు.

తాను దాదాపు ఆరు, ఎనిమిది నెలలుగా జిమ్ కి వెళ్తున్నట్లు; అలాగే తనకు మొదట నుంచి స్పోర్ట్స్, వ్యాయామం అంటే అసలు ఇంట్రెస్ట్ లేనట్లు చెప్పుకొచ్చారు. అలాగే మొదట్లో కొన్ని నెలలు ఇష్టం లేకుండానే ఈ జిమ్ కి వెళ్లినా, క్రమక్రమంగా ఆ అలవాటు తనలో ఓ కొత్త మార్పును తీసుకుని వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా తన భర్త హాస్పిటల్‌లో ఉండి సర్జరీ చేయించుకుంటున్నప్పుడు అయితే, తనకు ఈ కసరత్తు మానసిక దృఢత్వాన్ని పెంచి ధైర్యంగా ఉండేందుకు దోహదపడిందని చెప్పారు. ఇక ఈ ఆరు, ఎనిమిది నెలల్లో ఆమె దాదాపు 11 కిలోల వరకు తగ్గినట్లు కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఇలాంటి రోజువారీ వ్యాయామం కేవలం మోడల్స్ అండ్ నటీమణులకు మాత్రమే కాదని, తనలాగా 30 ఏళ్లు దాటిన గృహిణులు అందరికీ అవసరం అని, నన్ను చూసి వారు కూడా వ్యాయామం మొదలుపెడతారు అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక ఈ జిమ్ వర్కవుట్ వీడియోస్ అండ్ పిక్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు “చిరు సార్‌కే పోటీ వచ్చేలా ఉన్నారుగా వదినా” అని రీసెంట్ చిరు వర్కవుట్ వీడియోస్ ఉద్దేశించి కామెంట్స్ చేయగా; ఇంకొందరు “బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్త వదినా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అన్నా లెజినోవా ఆ కామెంట్స్ కు రిప్లై ఇస్తూ “బాస్ కి ఎవరు పోటీ రాలేరు, ఆయన ది బెస్ట్” అని, “నేనంటే మీకు ఎంత బాధ్యత” అని కూడా రిప్లై కామెంట్స్ ఇచ్చారు. దీంతో ఈ కాన్వర్సేషన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

గతంలో ఇన్‌స్టాగ్రామ్ ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్స్ నిర్వహించినప్పుడు కూడా ఈ డిప్యూటీ సీఎం సతీమణి.. “ముందు పవన్ కళ్యాణే నాకు ప్రపోజ్ చేశాడని”, ఆయనకు “అమ్మ చేతి మసాలా చికెన్ కర్రీ, వదిన చేతి చేపల పులుసు ఇష్టం” అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్ లో సందడి చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell