Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

అప్పుడు తన సినిమాలో బాలయ్య ఇప్పుడు బాలయ్య సినిమాలో మంచు హీరో

Telugu Bell 4 days ago

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు తన కెరీర్ 111వ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య నుంచి సాలిడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతుంది.

ఇక ఈ చిత్రంలో లేటెస్ట్ గా మంచు వారి హీరో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ యాడ్ అయినట్టుగా మేకర్స్ ఊహించని అప్డేట్ అందించారు.

దీనితో ఈ ప్రాజెక్ట్ లో మనోజ్ ఎలాంటి రోల్ లో కనిపిస్తాడు అనేది మరింత ఆసక్తిగా మారింది. అయితే గత పద్నాలుగేళ్ళ కితం మంచు మనోజ్ సినిమా ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? అనే సినిమాలో బాలయ్య గెస్ట్ రోల్ లో కనిపించారు. కామెడీ హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య రోల్ మంచి ఇంపాక్ట్ చూపించింది. ఇక మళ్ళీ ఇన్నాళ్ళకి బాలయ్య సినిమాలో మనోజ్ నటించనున్నాడు. సో ఈసారి తన రోల్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

The submit అప్పుడు తన సినిమాలో బాలయ్య ఇప్పుడు బాలయ్య సినిమాలో మంచు హీరో first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell