Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Arya's Mr. X Film Evaluation in Telugu

Telugu Bell 1 week ago

ఓటీటీ స్ట్రీమింగ్ తేది : మే 14, 2026
ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

టీనటులు: ఆర్య, శరత్ కుమార్, గౌతమ్ రామ్ కార్తీక్, మంజు వారియర్, జయ ప్రకాష్ తదితరులు

దర్శకత్వం: మను ఆనంద్
నిర్మాణం: శ్రీ వినీత్ జైన్, లక్ష్మణ్ కుమార్
సంగీతం: ధిబు నినన్ థామస్
ఛాయాగ్రహణం: అరుళ్ విన్సెంట్
కూర్పు: ప్రసన్న జీకే

సంబంధిత లింక్స్ : ట్రైలర్

రీసెంట్ గా కోలీవుడ్ నుంచి వచ్చిన చిత్రాల్లో ఓ ఆర్య, శరత్ కుమార్ అలాగే మంజు వారియర్ ల కలయికలో వచ్చిన స్పై యాక్షన్ చిత్రం “మిస్టర్ ఎక్స్” కూడా ఒకటి. దీనిని తెలుగు థియేట్రికల్ రిలీజ్ కూడా చేశారు కానీ సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఇది వచ్చినట్టు కూడా చాలామందికి తెలీదు. మరి ఈ సినిమా లేటెస్ట్ గా జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ లో వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

1960ల సమయంలో చైనా సిద్ధం చేసిన అణు ఆయుధం శక్తి తెలుసుకున్న అమెరికా భారత్ సహాయంతో ఒక మిషన్ పేరిట నందా నది ప్రాంతంలో ఒక సీక్రెట్ డివైజ్ ని ఏర్పాటు చేసి చైనాపై నిఘా వేయాలని చూస్తుంది. కానీ ఆ డివైజ్ భారత్ అనుకున్నది కాకుండా అత్యంత పవర్ఫుల్ న్యూక్లియర్ డివైజ్ ని పంపుతారు. కానీ ఈ మిషన్ లో ఆ డివైజ్ మిస్సవుతుంది. అక్కడ నుంచి ప్రస్తుత సమయం వరకు ఆ డివైజ్ ని ఎవరు కాపాడుతూ వచ్చారు? దాని వల్ల భారత్ కి పొంచి ఉన్న ముప్పు ఏంటి? దానిని ఎందుకు అన్ని దేశాలు పొందాలని చూస్తాయి? ఈ క్రమంలో గౌతమ్ (ఆర్య) రా టీం లీడర్, ఇందిరా వెర్మ (మంజు వారియర్) రా డైరెక్టర్ ఇందిరా వెర్మ (మంజు వారియర్) అండ్ టీం రావణ్ అనే ఇంటర్నేషనల్ క్రిమినల్ ప్లాన్ చేసిన భారీ అపాయాన్ని ఎలా ఆపారు? ఇందులో ఒకప్పటి రా ఏజెంట్ పరమేశ్వర్ సూర్య ప్రతాప్ (శరత్ కుమార్) పాత్ర ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

స్పై యాక్షన్ నేపథ్యంలో ఇది వరకే పలు సినిమాలు మనం చూసాం అదే బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రంలో కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. మెయిన్ గా కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇంకా సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు ఇందులో ఇంప్రెస్ చేస్తాయని చెప్పొచ్చు. అలాగే సినిమాలో యాక్షన్ బ్లాక్ లు కూడా బాగా డిజైన్ చేశారు.

ఇక నటీనటుల్లో అయితే ఆర్య తన రోల్ లో డీసెంట్ పెర్ఫామెన్స్ ని అందించాడు. ఒక సాలిడ్ రా ఏజెంట్ అండ్ లీడర్ గా మ్యాచో పర్సనాలిటీతో కనిపిస్తూ మంచి పెర్ఫామెన్స్ అందించాడు. అయితే ఇందులో చాలామంది మెయిన్ హీరో ఆర్య అనుకోవచ్చు కానీ అసలు మిస్టర్ ఎక్స్ గా కనిపించిన నటుడు శరత్ కుమార్ హైలైట్ అని చెప్పాలి. తన డెడికేషన్ గాని తన పాత్రపై చూపించే సన్నివేశాలు ట్విస్ట్ లు యాక్షన్ పార్ట్ అంతా ఇందులో ప్రధాన హైలైట్ గా కనిపిస్తాయి.

అలానే నటి మంజు వారియర్ తన రోల్ లో కాన్ఫిడెంట్ గా కనిపించారు. అంతే కాకుండా క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ లో ఆమె ఆశ్చర్యపరుస్తారు. ఇక వీరితో పాటుగా యంగ్ నటుడు గౌతమ్ రామ్ కార్తీక్ మంచి పెర్ఫామెన్స్ తో విలనిజాన్ని చూపించాడు. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో ఆడియెన్ ని లీనం చేయడానికి మాత్రం దర్శకుడు చాలా ఎక్కువ సమయాన్నే తీసుకున్నారని చెప్పొచ్చు. మొత్తం ఫస్టాఫ్ చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ ఫార్మాట్ స్క్రీన్ ప్లే తో పైగా స్లోగా సాగుతూ వెళుతుంది. దీంతో ఫస్టాప్ నుంచే కథనం అంత ఆసక్తిగా అనిపించదు.

అలానే కొన్ని కొన్ని సీన్స్ లాజిక్ మిస్ అయినట్టు కూడా అనిపిస్తుంది. వీటితో పాటుగా సెకండాఫ్ లో కంప్లెక్సిటీ పెరుగుతున్న కొద్దీ ఆసక్తితో పాటు ఒకింత కన్ఫ్యూజన్ మరికొంత రియాలిటీకి దూరంగా ఈ సీన్స్ ఎటెటో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇందులో బాగా మైనస్ అంశం ఏంటంటే కోలీవుడ్ ఇతర స్పై యాక్షన్ సినిమాలు విక్రమ్, సర్దార్ వంటి చిత్రాల ప్రేరణ ఇందులో బాగా కనిపిస్తుంది.

అప్పటివరకు శరత్ కుమార్ రోల్ పై ఉండే ఒక ఇంప్రెషన్ క్లైమాక్స్ పార్ట్ లో కీలక ట్విస్ట్ తర్వాత అందరికీ రుచించకపోవచ్చు. ఇంకో పెద్ద బ్లండర్ ఏంటంటే ఈ తరహా స్పై యాక్షన్ థ్రిల్లర్స్ కి సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పక్కాగా అవసరం కానీ ఇందులో స్కోర్ చాలా డిజప్పాయింట్ చేస్తుంది. ఎక్కడెక్కడో ఆల్రెడీ వినేసిన బీట్స్ తో సగం ఇంట్రెస్ట్ అక్కడే పోగొనట్టుగా అవుతుంది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు ఓకే అని చెప్పొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. పాటలు ఓకే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాలో డిజప్పాయింట్ చేస్తుంది. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు మను ఆనంద్ విషయానికి వస్తే.. తన వర్క్ బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. సబ్జెక్టు ఓకే కానీ ఇందులో విక్రమ్, సర్దార్ ల ప్రేరణ కనిపిస్తుంది. మధ్యలో కొంత డ్రామా మెయిన్ గా సెకండాఫ్ లో ప్లాన్ చేసుకున్నది కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. అలానే ట్విస్ట్ లు కూడా బానే డిజైన్ చేసుకున్నారు. కానీ ఇంకా రియాలిటీకి కొంచెం దగ్గరగా కథనాన్ని ప్లాన్ చేసుకుంటే బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘మిస్టర్ ఎక్స్’ కొంతమేరకు మాత్రమే ఓకే అనిపించే స్పై యాక్షన్ థ్రిల్లర్ అనుకోవచ్చు. ఇందులో శరత్ కుమార్ కి సాలిడ్ రోల్ దక్కింది తనతో పాటుగా మంజు వారియర్ కూడా ఇందులో ఆశ్చర్యపరుస్తారు. అలానే సెకండాఫ్ కొంచెం రిలీఫ్ ఇస్తుంది. కానీ ఇందులో స్లోగా సాగే కథనం, కొంచెం ఓవర్ గా అనిపించే కొన్ని సీన్స్ డల్ గా సాగే ఫస్టాఫ్ లు డిజప్పాయింట్ చేస్తాయి. పైగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చికాకు మరింత తెప్పిస్తుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని ట్రై చేస్తే మంచిది. లేదంటే వీకెండ్ కి బెటర్ ఆప్షన్ ఎంచుకున్నా పర్వాలేదు.

123telugu.com Score: 2.5/5

Reviewed via 123telugu Group

The publish ఓటిటి సమీక్ష: 'మిస్టర్ ఎక్స్' - తెలుగు డబ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell