Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

బాక్సాఫీస్ సైలెన్స్‌ను బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్న 'పెద్ది'

Telugu Bell 3 weeks ago

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గతకొంత కాలంగా నెలకొన్న సైలెన్స్‌ను బద్దలు కొట్టేందుకు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంతో థియేటర్లలోకి అడుగుపెడుతున్నాడు.

సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత టాలీవుడ్‌లో సరైన కమర్షియల్ సక్సెస్ లేక, వేసవి సెలవులను కూడా ఇండస్ట్రీ పూర్తిగా వాడుకోలేకపోయింది. ఇలాంటి డల్ పీరియడ్‌లో వస్తున్న ఏకైక భారీ చిత్రం ఇదే కావడంతో, తెలుగు చిత్రసీమ ఆశలన్నీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పైనే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మేకర్స్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌తో హోరెత్తిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా హంగామా.. అంతకంటే ముందే, అంటే జూన్ 3 రాత్రి నుంచే ప్రీమియర్ షోల రూపంలో మొదలుకానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ పీరియడ్ డ్రామాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా సాధించే ఓవరాల్ సక్సెస్ రేంజ్ మాత్రం నార్త్ ఇండియా వసూళ్లపైనే ఆధారపడి ఉంటుంది. 'బాహుబలి', 'పుష్ప' తరహాలో హిందీ బెల్ట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా టీమ్ అక్కడ గట్టిగా ప్రచారం చేస్తోంది.

ఈ చిత్రానికి బాలీవుడ్‌లో క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఆర్ఆర్ఆర్ ద్వారా రామ్ చరణ్‌కు దక్కిన పాపులారిటీ. అలాగే హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ క్రేజ్. వీరికి తోడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ నార్త్ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన 'రైరై రారా', 'చికిరి' వంటి పాటలు, పవర్‌ఫుల్ ట్రైలర్ హిందీ మార్కెట్‌లో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

ప్రస్తుతం బాలీవుడ్‌లో గట్టి పోటీ ఇచ్చే పెద్ద సినిమాలేవీ లేకపోవడం 'పెద్ది'కి కలిసిసొచ్చే పెద్ద లక్. పైగా నార్త్ ప్రేక్షకులు మన సౌత్ మాస్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇది ఒక రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథ కావడం వల్ల భాషతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ అప్పీల్ ఇందులో ఉంది. కాబట్టి హిందీ బెల్ట్‌లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఒకవేళ 'పెద్ది' ఆశించిన విజయాన్ని అందుకుంటే.. నార్త్ మార్కెట్‌లో రామ్ చరణ్ తిరుగులేని పట్టు సాధించినట్లవుతుంది. అలాగే 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు సానా డైరెక్ట్‌గా టాలీవుడ్ టాప్ లీగ్ దర్శకుల క్లబ్‌లో చేరిపోతాడు. అన్నింటికీ మించి, 'గేమ్ ఛేంజర్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న మెగా అభిమానులకు ఈ సినిమా విజయం ఒక పెద్ద బూస్ట్‌లా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి 'పెద్ది' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సౌండ్ చేస్తాడో చూడాలి.

The put up బాక్సాఫీస్ సైలెన్స్‌ను బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్న 'పెద్ది' first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell