నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు తన కెరీర్ 111వ సినిమాని దర్శకుడు గోపిచంద్ మలినేనితో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తన కెరీర్ 112వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో అనౌన్స్ చేయగా దీనికి భారీ హైప్ వచ్చింది.
ఇక ఈ సినిమా కూడా త్వరగానే కంప్లీట్ చేసి వచ్చే ఏడాది దింపనున్నారు.
అయితే ఈ సినిమా ముహూర్తం ఇప్పుడు ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఈ మే 9న సినిమా అధికారికంగా ముహూర్త కార్యక్రమాలతో లాంచ్ కానున్నట్టు ఇప్పుడు తెలుస్తోంది. సో ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో బాలయ్య, నందమూరి అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి యువసుధ ఆర్ట్స్ మరియు ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
The submit బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు!? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
