Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

బాలీవుడ్ డైరెక్టర్ కొత్త అవతారం.. ఇది కూడా బ్లాక్‌బస్టరేనా..?

Telugu Bell 4 days ago

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని తీసిన సినిమాలు తక్కువే అయినా, అవన్నీ సూపర్ హిట్లే. మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్, పీకే, సంజు, డంకి వంటి సినిమాలతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

హిరాని సినిమా వస్తోందంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరిగెడతారు.

ఆయన తన నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇంకా ప్రకటించలేదు. 'మున్నాభాయ్ 3' లేదా '3 ఇడియట్స్ సీక్వెల్' తీస్తారని ప్రచారం జోరుగా సాగుతున్నా ఆయన మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. అయితే, ఈ లోపు ఆయన ఒక వెబ్ సిరీస్‌తో మన ముందుకు కొత్త అవతారంలో వస్తున్నారు. 'ప్రీతమ్ అండ్ పెడ్రో' అనే వెబ్ సిరీస్‌కు క్రియేటర్‌గా మారి రాజ్ కుమార్ హిరాని మన ముందుకు తీసుకువస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ ఓటీటీలో జులై 3 నుండి ప్రసారం కానుంది. ఈ సిరీస్‌కు హిరాని నిర్మాతగా కూడా వ్యవహరించారు. అవినాశ్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌తో హిరాని తనయుడు వీర్ హిరాని హీరోగా పరిచయం అవుతున్నాడు. అలాగే మున్నాభాయ్ ఫేమ్ అర్షద్ వార్సీ ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ వెబ్ సిరీస్‌తో రాజ్ కుమార్ హిరాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

The put up బాలీవుడ్ డైరెక్టర్ కొత్త అవతారం.. ఇది కూడా బ్లాక్‌బస్టరేనా..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell