Dailyhunt

Bellamkonda: తిరుమలలో బెల్లంకొండ వివాహం.. రేపే ఎంగేజ్మెంట్?

Telugu Bell 1 week ago

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నారు, గత కొన్ని రోజులుగా ఈ మెగా ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తుండగా, వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ క్లారిటీ వచ్చేసింది.

కావ్య రెడ్డి అనే అమ్మాయితో శ్రీనివాస్ ఏడడుగులు వేయబోతున్నారు. నిజానికి వీరిద్దరి బంధం గత నెలలోనే ఒక అందమైన మలుపు తిరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన నిశ్చయ తాంబులాల వేడుకతో వీరి వివాహ ప్రయాణం అధికారికంగా మొదలైంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ 5న జరగబోయే నిశ్చితార్థంపై ఉంది. ఒక విశాలమైన ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకను ప్లాన్ చేశారు. ఇటు కుటుంబ సభ్యులతో పాటు అటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరుకానున్నారు.

Additionally Learn:Biker: ఆ ఒక్కటీ చేసుంటే నెక్స్ట్ లెవల్!

సినిమా స్టైల్ పెళ్లిళ్ల కంటే భిన్నంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తిరుమల వేదికగా ఈ జంట పెళ్లి చేసుకోబోతుండటం విశేషం..ఏప్రిల్ 29న శ్రీవారి సన్నిధిలో వీరి వివాహం జరగనుంది. ఆ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో, ప్రశాంతమైన వాతావరణంలో వేద మంత్రాల సాక్షిగా శ్రీనివాస్-కావ్య రెడ్డి దంపతులు కాబోతున్నారు. మాస్ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్, ఇప్పుడు తన లైఫ్‌లో మరో మెట్టు ఎక్కుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell