Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Buchi Babu: ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ పెద్ది కాదు: బుచ్చిబాబు

Telugu Bell 3 weeks ago

Buchi Babu: టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లలో ఒకటైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబో తెరకెక్కిన 'పెద్ది'పై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రూమర్ గట్టిగా షికారు చేస్తోంది. గతంలో బుచ్చిబాబు – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ‘పెద్ది’ అనే టైటిల్‌తో ఒక కథ అనుకున్నారని… ఇప్పుడు అదే కథను కొద్దిపాటి మార్పులతో రామ్ చరణ్‌తో తీస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజాగా ఈ రూమర్స్‌పై దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు.

ఎన్టీఆర్ కథ వేరు.. చరణ్ కథ వేరు
రూమర్లకు ఫుల్ స్టాప్ పెడుతూ డైరెక్టర్ బుచ్చిబాబు క్లియర్ కట్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. “ఎన్టీఆర్ గారి కోసం నేను రాసుకున్న కథ ‘పెద్ది’ కాదు. అది పూర్తిగా వేరే కథ. ప్రస్తుతం నేను చేస్తున్న ప్రాజెక్ట్ ప్రత్యేకంగా రామ్ చరణ్ గారి కోసమే రాసుకున్నాను” అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒక్క మాటతో చరణ్ కోసం బుచ్చిబాబు ఒక పక్కా లోకల్, రా అండ్ రస్టిక్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని క్లారిటీ వచ్చేసింది. ‘ఉప్పెన’ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే నేషనల్ అవార్డు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బుచ్చిబాబు… తన తర్వాతి సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చరణ్ లాంగ్వేజ్, స్టార్‌డమ్‌కు సరిపోయేలా ఆయన ఈ కథను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. చరణ్ కెరీర్‌లోనే ఇదొక మైల్‌స్టోన్ మూవీ కాబోతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నారట. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో మెరవనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా ముందుగా ఎన్టీఆర్ కోసం రెడీ చేశారని జరుగుతున్న ప్రచారానికి తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు క్లారిటీ ఇవ్వడంతో కథపై ఉన్న కన్ఫ్యూజన్ తొలగిపోవడమే కాకుండా… చరణ్ కోసమే పుట్టిన పక్కా స్క్రిప్ట్ ఇదని తేలడంతో మెగా ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రం జూన్ 4న రిలీజ్ కాబోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell