Dailyhunt

చరణ్ కోసం సుకుమార్ ఇంకా ఆ మోడ్‌లోనే..?

Telugu Bell 1 week ago

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, 'పుష్ప 2' వంటి భారీ విజయం తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్టును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసేందుకు సిద్ధమయ్యారు.

గత కొన్ని నెలలుగా చరణ్ కోసం మూడు విభిన్నమైన కథాంశాలపై కసరత్తు చేసిన సుకుమార్, చివరికి ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన టీమ్‌తో కలిసి ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన, మే మధ్యలో రామ్ చరణ్‌కు పూర్తిస్థాయి నరేషన్ ఇవ్వనున్నాడట.

సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో ఎంత సమయం తీసుకున్నా, సెట్స్‌పై కూడా మార్పులు చేస్తుంటాడు. ఈ తాజా చిత్ర షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ లోపు రామ్ చరణ్ కొంత విరామం తీసుకుని, ఈ సినిమా పాత్రకు తగినట్టుగా తన మేకోవర్ మరియు లుక్స్‌పై దృష్టి సారించనున్నాడు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకోవడంతో, త్వరలోనే షూటింగ్ షెడ్యూల్స్ మరియు ఇతర నటీనటుల వివరాలపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

The put up చరణ్ కోసం సుకుమార్ ఇంకా ఆ మోడ్‌లోనే..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell