Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

చరణ్ 'పెద్ది' శాటిలైట్ రైట్స్ పై బిగ్ న్యూస్ !

Telugu Bell 1 week ago

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పెద్ది'. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా జూన్ 4, 2026న విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాలు ఒక్కొక్కటిగా జరుగుతుండటంతో, సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐతే, ఈ సినిమా తన టీవీ ప్రసార భాగస్వామిని ఖరారు చేసుకుందని టాక్. జీ తెలుగు భారీ మొత్తానికి ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుందట.

కాగా ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ వద్ద ఉన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ రేపు విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్టు ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

The publish చరణ్ 'పెద్ది' శాటిలైట్ రైట్స్ పై బిగ్ న్యూస్ ! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell