ఇండియన్ సినిమా నుంచి వచ్చిన పలు బెస్ట్ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో మలయాళ సినిమా డెలివర్ చేసిన క్రేజీ హిట్ చిత్రం 'దృశ్యం' కూడా ఒకటి.
మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ కలయికలో చేసిన ఈ సినిమా రెండు భాగాలూ కూడా సాలిడ్ హిట్ అయ్యి పర్ఫెక్ట్ సీక్వెల్ తో కూడిన ఫ్రాంఛైజ్ గా నిలిచింది.
అయితే ఇప్పుడు పార్ట్ 3 ని మాత్రం మేకర్స్ ఒరిజినల్ నే పాన్ ఇండియా లెవెల్లో తీసుకొస్తున్నారు. అయితే మలయాళంలో సినిమా హైప్ ఓకే కానీ మిగతా వెర్షన్ లలో మాత్రం పూర్తిగా డెడ్ అనే చెప్పక తప్పదు. రేపే సినిమా రిలీజ్ అయినప్పటికీ మినిమమ్ బుకింగ్స్ ఈ సినిమాకి కనిపించడం లేదు. మెయిన్ గా మన తెలుగులో ఈ సినిమాని వెంకీ మామకే వదిలేయాల్సింది.
ఒరిజినల్ నే ఇపుడు డబ్బింగ్ చేసి తీసుకొస్తుండగా దీనికి మినిమమ్ ప్రమోషన్స్ కూడా చేయకుండా పక్కన పెట్టేసారు. బహుశా దృశ్యం సిరీస్ కదా తెలుగు ఆడియెన్స్ చూసేస్తారు అనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మన వాళ్ళు కనీసం ఈ సినిమా ఒకటి ఉందని పట్టించుకోవడం లేదు.
సో ఈ సినిమా ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్న వెంకీ మామకే వదిలేసి ఉంటే సాలిడ్ ఓపెనింగ్స్ దక్కి ఉండేవి మరి ఈ ఛాన్స్ ని వారు మిస్ చేసుకున్నారు. ఇక రిలీజ్ అయ్యాక ఏమన్నా లెక్కలు మారుతాయేమో చూడాలి మరి.
The put up డెడ్ హైప్ లో 'దృశ్యం 3' తెలుగు.. వెంకీ మామకే వదిలెయ్యాల్సిందా first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
