Dailyhunt

'డెకాయిట్' ట్రైలర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.. ఎప్పుడంటే..?

Telugu Bell 2 weeks ago

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'డెకాయిట్' ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా రివెంజ్ డ్రామాగా, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో రూపొందుతోంది. ఇందులో శేష్‌ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఒక కీలక అప్‌డేట్ ఇచ్చాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'డెకాయిట్' ట్రైలర్‌ను ఏప్రిల్ 4న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను ఈ ట్రైలర్ మరో స్థాయికి తీసుకెళ్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి డెకాయిట్ చిత్రంతో అడివి శేష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

The submit 'డెకాయిట్' ట్రైలర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.. ఎప్పుడంటే..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell