Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

దేవర సీక్వెల్.. ఏమిటీ కన్ఫ్యూజన్..?

Telugu Bell 3 days ago

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చాయి. అందులో భాగంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' సినిమాకు సంబంధించిన వీడియో గ్లింప్స్ బయటకు వచ్చి అభిమానులను అలరించింది.

అయితే, ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్', అలాగే 'దేవర 2' అప్‌డేట్స్ మాత్రం ఈ బర్త్‌డేకి రాలేదు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోయే 'గాడ్ ఆఫ్ వార్' సినిమా అనౌన్స్‌మెంట్‌ను ఎన్టీఆర్ జూన్ నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయని, సినిమా ఖచ్చితంగా ఉంటుందని సమాచారం. కానీ, 'దేవర 2' విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గత ఏడాది కాలంగా చర్చల్లో ఉన్న ఈ సీక్వెల్ గురించి ఎన్టీఆర్ బర్త్‌డే నాడు ఎలాంటి చిన్న అప్‌డేట్ కూడా రాకపోవడంతో.. ప్రస్తుతానికి 'దేవర 2' హోల్డ్‌లో పడినట్లేనని దాదాపు స్పష్టమైంది.

దర్శకుడు కొరటాల శివ ఈ ఏడాదిలో ప్రారంభం కానున్న నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ చిత్రంతో పూర్తిగా బిజీ కానున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ లైన్‌లో కూడా త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్'తో పాటు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఒకవేళ 'దేవర 2' చేసే ఉద్దేశం ఉండి ఉంటే, కనీసం ఒక చిన్న పోస్టర్ అయినా రిలీజ్ చేసేవారని, ప్రస్తుతానికి ఎన్టీఆర్ ప్రయారిటీ లిస్ట్‌లో ఈ సీక్వెల్ లేదని సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. మరి దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.
Zoomed out of merchandise.

The submit దేవర సీక్వెల్.. ఏమిటీ కన్ఫ్యూజన్..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell