రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ పాన్-ఇండియా చిత్రం 'డేవిడ్ రెడ్డి' నుంచి మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేవారు.
1897 నుండి 1920 మధ్య, బ్రిటిష్ కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోతుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇక ఈ టీజర్‌లో మంచు మనోజ్ సరికొత్త ఉగ్రరూపంలో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. గాంధీజీ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి బ్రిటిష్ వారు ప్రయత్నిస్తున్న తరుణంలో, వారికి ఎదురుతిరిగే పవర్‌ఫుల్ యోధుడిగా మనోజ్ పాత్రను చూపించారు. ఆయన నటన, లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉన్నాయి. ఈ సినిమాలో మనోజ్ సరసన మరియా నటించగా రమ్యకృష్ణ, సముద్రఖని, అభయ్ డియోల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
టీజర్‌లో రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్లు సినిమాపై అంచనాలను పెంచేసాయి. బ్రిటిష్ వారు మనోజ్‌ను చూసి భయపడి 'రాక్షస రెడ్డి' అని పిలవడం టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ భారీ చిత్రం 2026 దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
The submit 'డేవిడ్ రెడ్డి' టీజర్ టాక్ : రాక్షసుడిగా మనోజ్ ఉగ్రరూపం..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
