Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dhanush: తమిళనాడు నెక్స్ట్ సీఎం రేసులోకి ధనుష్? దళపతి విజయ్ బాటలోనే ఆ స్టార్ హీరో !

Dhanush: తమిళనాడు నెక్స్ట్ సీఎం రేసులోకి ధనుష్? దళపతి విజయ్ బాటలోనే ఆ స్టార్ హీరో !

Telugu Bell 4 days ago

Dhanush: నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో ధనుష్ (Dhanush) పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఆయన అభిమాన సంఘం (All India Dhanush Enthusiasts Welfare Affiliation) తాజాగా ఆవిష్కరించిన ఒక అధికారిక జెండా ఇటు సినీ వర్గాల్లో, అటు తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది.

ఈ పరిణామంతో ధనుష్ కూడా త్వరలోనే సీఎం, దళపతి విజయ్ లాగా ప్రజా జీవితంలోకి ప్రత్యక్షంగా అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రంలో ధనుష్ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపిస్తున్నారు. దీని వెనుక ఎరుపు, తెలుపు రంగుల కలయికతో రూపొందించిన జెండా ఉంది. ఈ సరికొత్త డిజైన్ సాధారణ సామాజిక సేవా సంఘాల గుర్తుల కంటే పూర్తి రాజకీయ శైలిని కలిగి ఉండటంతో అందరి చూపు దీనిపైనే పడింది. కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమాన సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో నటుడు దళపతి విజయ్ (TVK పార్టీ) సృష్టించిన సంచలన విజయం తర్వాత, ఇప్పుడు ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ నెట్‌వర్క్ కూడా అదే దారిలో నడుస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. విజయ్ కూడా మొదట తన అభిమాన సంఘాల ద్వారానే క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకుని, ఆ తర్వాతే పార్టీని ప్రకటించారు. ధనుష్ కూడా ఇప్పుడు వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ హడావిడి అంతా ప్రస్తుతానికి ఫ్యాన్స్ క్లబ్ స్థాయిలోనే జరుగుతోంది. దీనిపై ధనుష్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ధనుష్, కేవలం తన అభిమానుల గుర్తింపు కోసమే ఈ జెండాను అనుమతించారా? లేక దీని వెనుక ఏదైనా లాంగ్ టర్మ్ పొలిటికల్ స్కెచ్ ఉందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell