Dailyhunt

Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు

Telugu Bell 1 week ago

చియాన్ విక్రమ్ అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న స్పై థ్రిల్లర్ 'ధృవ నక్షత్రం'. ఎన్నో ఏళ్లుగా విడుదలకు నోచుకోని ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు ముహూర్తం కుదిరేలా కనిపిస్తోంది.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం నుండి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ‘ధృవ నక్షత్రం’ చిత్రాన్ని మే 22న విడుదల చేసేందుకు మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అదే సమయంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ సినిమా కూడా మే 14న విడుదల కానుంది.

వారం రోజుల వ్యవధిలో రెండు భారీ సినిమాలు విడుదల కావడం బాక్సాఫీస్ వద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘ధృవ నక్షత్రం’ టీమ్ ‘కరుప్పు’ చిత్ర నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతోంది. సూర్య సినిమాను ఒక రెండు వారాల పాటు వాయిదా వేయాలని వారు కోరుతున్నట్లు సమాచారం. ఒకవేళ ‘కరుప్పు’ టీమ్ ఇందుకు అంగీకరించకపోతే అప్పుడు గౌతమ్ మీనన్ తన సినిమానే జూన్ మొదటి వారానికి అంటే మే 22 నుండి రెండు వారాల తర్వాత వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. గత ఎనిమిదేళ్లుగా ఆర్థిక మరియు న్యాయపరమైన ఇబ్బందుల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇటీవలే మద్రాస్ హైకోర్టులో న్యాయ వివాదాలు ముగియడంతో ఈ వివాదాలన్నీ సర్దుమణిగాయని మే 22 విడుదలకు లైన్ క్లియర్ అయిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. విక్రమ్ ఈ సినిమాలో స్టైలిష్ స్పై ఏజెంట్‌గా కనిపిస్తుండగా హారిస్ జయరాజ్ సంగీతం సినిమాపై అంచనాలను పెంచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell