Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Dragon: నేషనల్ మీడియా సమక్షంలో 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!

Telugu Bell 1 week ago

తారక్ పుట్టినరోజు కానుకగా మే 20న రాబోయే 'డ్రాగన్' అప్‌డేట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

అయితే, ఒకరోజు ముందుగానే అంటే మే 19 అర్ధరాత్రి 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలి సోషల్ మీడియాను షేక్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను కేవలం సౌత్ కే పరిమితం చేయకుండా, నేషనల్ లెవల్లో భారీగా ప్లాన్ చేశారు. దీనికోసం ఎన్టీఆర్ స్వయంగా ముంబై వెళ్లనున్నారు. అక్కడ జాతీయ మీడియా సమక్షంలో ఈ ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్‌ను ప్రెజెంట్ చేయబోతున్నారు.

'సలార్' వంటి భారీ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ వర్గాల్లో కూడా ఈ ప్రాజెక్టుపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందుకే ప్రమోషన్లను ముంబై నుంచే గ్రాండ్‌గా మొదలుపెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు అదిరిపోయే బిజియం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 11, 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ గ్లింప్స్‌తో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తారక్ మరోసారి తన సత్తా చాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell