Dailyhunt

dune3 : ఒక్క టికెట్ ధర రూ.90,000.. ఇది కదా క్రేజ్ అంటే!

Telugu Bell 3 weeks ago

హాలీవుడ్ విజువల్ వండర్ 'డ్యూన్ 3' (Dune 3) సెన్సేషన్ ఇప్పుడే మొదలైపోయింది. ఈ ఏడాది డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులను తిరగరాస్తున్నాయి.

ముఖ్యంగా అత్యంత అరుదైన ఐమ్యాక్స్ 70mm (IMAX 70mm) ఫార్మాట్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే అమ్ముడైపోవడంతో, ఇప్పుడు రీసేల్ మార్కెట్‌లో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.90 వేల రూపాయల వరకు పలుకుతుండటం చూసి ట్రేడ్ అనలిస్టులు సైతం నోరెళ్లబెడుతున్నారు.

Additionally Learn : Peddi: రామ్ చరణ్ 'పెద్ది' స్పెషల్ సాంగ్‌లో.. మిస్ ఇండియా!

అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఈ సినిమా క్రేజ్ పీక్స్‌లో ఉంది. ఇంత భారీ ధర పెరగడానికి ప్రధాన కారణం ఐమ్యాక్స్ 70mm స్క్రీన్ల కొరతే. ప్రపంచవ్యాప్తంగా ఈ స్పెషల్ ఫార్మాట్ స్క్రీన్లు కేవలం 19 లొకేషన్లలో మాత్రమే అందుబాటులో ఉండటంతో, ఆ విజువల్ గ్రాండియర్‌ను ఎంజాయ్ చేయాలనుకునే డైహార్డ్ ఫ్యాన్స్ ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడటం లేదు. ఒక సాధారణ సినిమా టికెట్ ధరతో పోలిస్తే ఇది కొన్ని వందల రెట్లు ఎక్కువ. ఈ రేట్లు చూస్తుంటే 'డ్యూన్ 3' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అర్థమవుతోంది. డెనిస్ విల్లెనూవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ క్లైమాక్స్ పార్ట్ కోసం ప్రపంచం మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell