Dailyhunt

EKDIN : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. డిజాస్టర్

Telugu Bell 1 week ago

క్షిణాదిలో తన అద్భుతమైన నటనతో 'లేడీ పవర్ స్టార్'గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. తెలుగు, తమిల్, మలయాళంలో బిగ్ హిట్స్ అందుకున్న సాయి పల్లవి ఇటీవల అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో జోడీ కట్టి 'ఏక్ దిన్ ' చిత్రం ద్వారా హిందీ ప్రేక్షకులను పలకరించింది.

వరుస సక్సెస్ లతో జెట్ స్పీడ్ వెళ్తున్న సాయి పల్లవికి ఏక్ దిన్ బ్రేక్ వేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. మొదటి వీకెండ్ ముగిసే సమయానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘ఏక్ దిన్’ సినిమా మొదటి మూడు రోజుల వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 3.88 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. సాయి పల్లవి వంటి స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. తొలి ఆట నుండే ఈ సినిమాపై నెగటివ్ టాక్ రావడంతో ఇక ఈ చిత్రం కోలుకోవడం కష్టమని విశ్లేషకులు తేల్చేశారు. దీంతో సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ డిజాస్టర్ ఖాతాలోకి చేరిపోయింది. కథలో బలం లేకపోవడం మరియు ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడమే ఈ ఫ్లాప్‌కు ప్రధాన కారణాలుగా కూడా చెప్పుకోవచ్చు. తెలుగులో ఈ సినిమాను ఒక రోజు అనే పేరుతో రిలీజ్ చేసారనే సంగతి తెలియదంటే అర్ధం చేసుకోవచ్చు ప్రమోషన్స్ ఏ స్థాయిలో చేసారో. ఇప్పుడు సాయి పల్లవి బాలీవుడ్ ఆశలన్నీ రణబీర్ కపూర్ సరసన నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రామాయణ్’ పైనే ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell