ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్). ఈ సినిమాకి సంబంధించి తర్వాత చేయనున్న షెడ్యూల్ లో ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు.
ఇది ప్రత్యేక పాట అని, ఈ పాటలో ఎన్టీఆర్ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ కనిపిస్తోందని టాక్. మరి ఈ సాంగ్ ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో చూడాలి. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా మే 20న ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తోంది.
కానీ, ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట. పైగా బ్లాక్ షేడ్ ఫ్రేమ్ కూడా సినిమాలో కనిపించదట. మరి ప్రశాంత్ నీల్ అంత కలర్ ఫుల్ గా ఏం తీస్తున్నాడో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
The submit 'ఎన్టీఆర్'తో మరో బ్యూటీ ప్రత్యేక పాట ? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
