Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఎట్టకేలకు 'జన నాయగన్' ముందుకు జరుగుతున్నాడు..!

Telugu Bell 6 days ago

మిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్' రిలీజ్‌కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది.

సెన్సార్ సమస్యల కారణంగా దాదాపు ఐదు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రంపై తాజాగా ఒక భారీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాను వీక్షించిన రివైజింగ్ కమిటీ ప్యానెల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ వీకెండ్ లోగా మేకర్స్‌కు సెన్సార్ సర్టిఫికేట్ అందనుంది.

సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాగానే చిత్ర యూనిట్ అధికారికంగా కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ సినిమాను జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన వెంటనే మేకర్స్ బిజినెస్ డీల్స్ క్లోజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్, జీ స్టూడియోస్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఘన విజయం సాధించిన నేపథ్యంలో, ఆయన చివరి చిత్రంగా వస్తున్న 'జన నాయగన్' పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

The publish ఎట్టకేలకు 'జన నాయగన్' ముందుకు జరుగుతున్నాడు..! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell