Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Gayapadda Simham: 'గాయపడ్డ సింహం' ఓటీటీ రిలీజ్..

Telugu Bell 2 days ago

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ 'గాయపడ్డ సింహం' (Gayapadda Simham).

కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ కామెడీ స్పూఫ్ డ్రామా.. ప్రమోషన్స్‌తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న, ఆడియన్స్‌ను మెప్పించే బలమైన కంటెంట్ లేకపోవడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఊహించని విధంగా డిజప్పాయింట్మెంట్‌నే మిగిల్చింది. థియేట్రికల్ రన్ త్వరగానే ముగిసిపోవడంతో, ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Top Video) ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుని ఆడియన్స్ ముందుకు తెచ్చేసింది.

కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ఇవాళ్టి నుంచే (మే 22, 2026) అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్లు అందరూ ఇంట్లోనే కూర్చుని ఈ వీకెండ్‌లో ప్రశాంతంగా ఈ కామెడీ స్పూఫ్ డ్రామాను వీక్షించవచ్చు. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్‌తో పాటు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో, వర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి (JD Chakravarthy) ఒక కీలక పాత్రలో నటించడం విశేషం. సప్త అశ్వ మీడియా వర్క్స్.. జీ స్టూడియోస్ (Zee Studios) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఓటీటీలో ఒకసారి ట్రై చేయవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell