యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఒక భారీ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నాడు. ప్రముఖ గ్లోబల్ సంస్థ 'అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్'తో నిఖిల్ చేతులు కలుపుతున్నాడు.
దీనికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా నిఖిల్ 'కార్తికేయ 2' చిత్రంతో బ్లాక్‌బస్టర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నిఖిల్ భాగస్వామ్యం అవుతుండటంతో ఆయన అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది.
అయితే, ఎంజిఎం స్టూడియోస్‌తో నిఖిల్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మే 15న వెల్లడించనున్నారు. మరి గ్లోబల్ స్థాయిలో నిఖిల్ చేయబోయే ఈ ప్రాజెక్ట్ ఏమై ఉంటుందో చూడాలి.
The publish హాలీవుడ్ స్టూడియోతో చేతులు కలిపిన నిఖిల్.. దేనికోసమే..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
